Categories: Jobs EducationNews

BSF : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పని చేయాలనుకుంటున్నవారికి శుభవార్త

Advertisement
Advertisement

BSF Tradesman Posts 2025 : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 2025 సంవత్సరానికి సంబంధించి భారీ స్థాయిలో నియామక ప్రక్రియను ప్రారంభించింది. ట్రేడ్స్‌మెన్ పోస్టుల కోసం మొత్తం 3588 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 3406 పోస్టులు పురుషుల కోసం, 182 పోస్టులు మహిళల కోసం ఉన్నాయి. అభ్యర్థులు 2025 ఆగస్ట్ 23లోగా అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ నియామకాల్లో కుక్, వాటర్ క్యారియర్, బార్బర్, కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, ప్లంబర్, పెయింటర్, స్వీపర్, టైలర్, వాషర్‌మ్యాన్ వంటి విభిన్న ట్రేడ్స్ ఉన్నాయి. వయసు పరంగా కనీసం 18 ఏళ్లు పూర్తి చేసి ఉండాలి, గరిష్టంగా 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయసులో సడలింపులు ఉంటాయి.

Advertisement

BSF Tradesman Posts

విద్యార్హతల విషయంలో ట్రేడ్‌ను బట్టి అర్హతలు వేరుగా నిర్ధేశించారు. ఉదాహరణకు కుక్, వాటర్ క్యారియర్, వైటర్ ఉద్యోగాలకు కనీసం పదో తరగతి పాస్ కావాలి. అదనంగా కిచెన్ లేదా ఫుడ్ ప్రొడక్షన్‌లో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ ఉండాలి. ఎలక్ట్రిషియన్, ప్లంబర్, పెయింటర్ పోస్టులకు పదో తరగతితో పాటు ఐటీఐ డిప్లొమా లేదా అనుభవం తప్పనిసరి. టైలర్, కాబ్లర్, వాషర్‌మ్యాన్, బార్బర్ పోస్టుల విషయంలో పదో తరగతి పాస్‌తో పాటు ఆ పనిలో నైపుణ్యం ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.150 + జీఎస్టీగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంది.

Advertisement

ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ టెస్టులు, ట్రేడ్ టెస్టులు, రాత పరీక్ష ప్రధానంగా ఉంటాయి. పురుషులు 5 కిలోమీటర్ల పరుగును 24 నిమిషాల్లో పూర్తి చేయాలి, మహిళలు 1.6 కిలోమీటర్లను 8 నిమిషాలు 30 సెకన్లలో పూర్తిచేయాలి. ట్రేడ్ టెస్టులో అభ్యర్థుల నైపుణ్యాన్ని ప్రాక్టికల్‌గా పరీక్షిస్తారు. అనంతరం జరిగే రాత పరీక్షలో 100 మార్కుల ప్రశ్నాపత్రం ఉంటుంది. పాస్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్‌కి హాజరుకావాలి. ఎంపికైనవారికి 7వ పే కమిషన్ ప్రకారం లెవల్ 3 జీతం (రూ.21,700 – రూ.69,100)తో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి. ఈ నియామకాలు యువతకు మంచి అవకాశంగా భావించబడుతున్నాయి.

Advertisement

Recent Posts

UPI : గూగుల్ పే, ఫోన్‌పే, యూజర్లకు శుభ‌వార్త‌.. యూపీఐ పేమెంట్ ఫెయిల్ అయిందా..? ఇలా చేస్తే ఎక్స్‌ట్రా డ‌బ్బులు వ‌స్తాయి..!

Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…

49 minutes ago

Sunitha : అందరి కంట్లో నీళ్ళు తెప్పించిన సింగర్ సునీత

Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…

2 hours ago

Tirumala Laddu Prasadam : తిరుమల లడ్డూ నెయ్యి వివాదం.. రాజకీయ దుమారానికి తెర

Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…

3 hours ago

Ys Jagan : బిగ్ బ్రేకింగ్.. ఆ పార్టీ తో జగన్ పొత్తు .. FIX అయిపోయిందా ?

Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…

4 hours ago

Vijay Karthik – Keerthi Bhat : డబ్బులేవని వదిలేసింది ఛీ .. కీర్తి భట్ ex చెప్పిన దారుణాలు

Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…

5 hours ago

KCR : బిగ్ బ్రేకింగ్.. ఫోన్ ట్యాపింగ్ లో మరో సంచలనం..కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సిట్

KCR  : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…

6 hours ago

Loan Against Mutual Funds : డబ్బు అర్జెంట్‌గా కావాలా? మ్యూచువల్ ఫండ్స్‌పై తక్కువ వడ్డీకే లోన్.. పూర్తి వివరాలు ఇవే!

Against Mutual Funds : నేటి డిజిటల్ యుగంలో లోన్ తీసుకోవడం చాలా సులభమైపోయింది. పర్సనల్ లోన్, హోమ్ లోన్…

6 hours ago

BB JODI Season 2 Promo 1 : రీతూ చౌదరి వాక్ అవుట్ .. శ్రీజ ని చూడగానే

BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…

7 hours ago