Allu Arjun | అట్లీ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మూవీ .. రిలీజ్ డేట్ చెప్పిన బ‌న్నీ వాసు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun | అట్లీ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మూవీ .. రిలీజ్ డేట్ చెప్పిన బ‌న్నీ వాసు

 Authored By sandeep | The Telugu News | Updated on :9 October 2025,4:20 pm

Allu Arjun | బన్నీ ఇప్పుడు తమిళ హిట్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఒక భారీ సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాకు దాదాపు ₹800 కోట్ల బడ్జెట్ కేటాయించారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే ఒక అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు. ఇందులో సూపర్ హీరో కాన్సెప్ట్ ఉంటుందని హింట్ ఇచ్చారు. దీంతో ప్రేక్షకుల ఊహలకు అంతే లేకుండా పోయింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

#image_title

బన్నీ వాస్ స్పెషల్ క్లారిటీ

బన్నీ వాస్, తన ప్రొడక్షన్‌లో వస్తున్న “మిత్ర మండలి” సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ..”అల్లు అర్జున్ – అట్లీ సినిమా చాలా స్పెషల్. ఆ సినిమా రిలీజ్ డేట్‌ను 2026 సంక్రాంతికి అధికారికంగా ప్రకటిస్తారు” అని చెప్పారు.ఈ ఒక్క మాటతోనే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.

అల్లు అర్జున్ – అట్లీ సినిమా భారీగా తెరకెక్కుతోంది. ₹800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో చిత్రాన్ని రూపొందించ‌నున్నారు. రిలీజ్ డేట్‌ను ఈ సంక్రాంతికి అధికారికంగా ప్రకటించనున్నార‌ని తెల‌ప‌డంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం అవ‌ధులు దాటింది. ఇప్పుడు చిన్న అప్డేట్‌కి ఇంత రెస్పాన్స్ వస్తే, సినిమా రిలీజ్‌య్యే టైమ్‌లో హంగామా ఎలా ఉంటుందో ఊహించండి!

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది