#image_title
EGGS | గుడ్డు అనేది పోషకాలతో నిండిన అద్భుతమైన ఆహారం. చిన్నదిగా కనిపించినా ఇందులో ఉండే ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి ఎన్నో లాభాలను అందిస్తాయి. రోజూ ఒకటి రెండు ఉడికించిన గుడ్లు తినాలని నిపుణులు సలహా ఇస్తుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో గుడ్లు తిన్న తర్వాత గ్యాస్, ఉబ్బరం వంటి అసౌకర్యాలు కలగడం వల్ల చాలా మంది గందరగోళంలో పడతుంటారు. నిజంగా గుడ్లు తినడం వల్ల గ్యాస్ట్రిటిస్ వస్తుందా?
#image_title
గుడ్లు & గ్యాస్ట్రిక్ సమస్యల మధ్య సంబంధం ఏమిటి?
గుడ్లలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సమయంలో కొన్ని వాసన కలిగించే వాయువులుగా మారి ఉబ్బరం, గ్యాస్ కలిగించవచ్చు. గుడ్లలో ఉండే అధిక ప్రోటీన్ జీర్ణానికి కొంత సమయం పడుతుంది. దీనివల్ల కొంతమందిలో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయి.
కొందరికి గుడ్లలోని తెల్లసొన పట్ల అలెర్జీ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలతో పాటు ఇతర ప్రతికూల ప్రభావాలను కలిగించవచ్చు. కొంతమందిలో గుడ్ల ప్రోటీన్‌ను జీర్ణించడానికి అవసరమైన ఎంజైమ్‌లు సరిపోకపోవడం వల్ల గ్యాస్, అసిడిటీ రావచ్చు. ఒకేసారి ఎక్కువ గుడ్లు తినడం, పచ్చిగా లేదా సగం ఉడికించిన గుడ్లు తినడం, ఉల్లిపాయలు, బీన్స్, క్యాబేజీ వంటి గ్యాస్ కలిగించే ఆహారాలతో కలిపి తినడం వారికి గ్యాస్ సమస్య వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు గుడ్లను బాగా ఉడికించి తినండి, గుడ్లను మితంగా తీసుకోండి.గ్యాస్ సమస్య కలిగించే ఇతర ఆహారాలతో కలిపి తినవద్దు
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.