EGGS | గుడ్లు తింటే గ్యాస్ వస్తుందా..అసలు విషయాలేంటో తెలుసుకోండి!
EGGS | గుడ్డు అనేది పోషకాలతో నిండిన అద్భుతమైన ఆహారం. చిన్నదిగా కనిపించినా ఇందులో ఉండే ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి ఎన్నో లాభాలను అందిస్తాయి. రోజూ ఒకటి రెండు ఉడికించిన గుడ్లు తినాలని నిపుణులు సలహా ఇస్తుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో గుడ్లు తిన్న తర్వాత గ్యాస్, ఉబ్బరం వంటి అసౌకర్యాలు కలగడం వల్ల చాలా మంది గందరగోళంలో పడతుంటారు. నిజంగా గుడ్లు తినడం వల్ల గ్యాస్ట్రిటిస్ వస్తుందా?
#image_title
గుడ్లు & గ్యాస్ట్రిక్ సమస్యల మధ్య సంబంధం ఏమిటి?
గుడ్లలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సమయంలో కొన్ని వాసన కలిగించే వాయువులుగా మారి ఉబ్బరం, గ్యాస్ కలిగించవచ్చు. గుడ్లలో ఉండే అధిక ప్రోటీన్ జీర్ణానికి కొంత సమయం పడుతుంది. దీనివల్ల కొంతమందిలో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయి.
కొందరికి గుడ్లలోని తెల్లసొన పట్ల అలెర్జీ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలతో పాటు ఇతర ప్రతికూల ప్రభావాలను కలిగించవచ్చు. కొంతమందిలో గుడ్ల ప్రోటీన్‌ను జీర్ణించడానికి అవసరమైన ఎంజైమ్‌లు సరిపోకపోవడం వల్ల గ్యాస్, అసిడిటీ రావచ్చు. ఒకేసారి ఎక్కువ గుడ్లు తినడం, పచ్చిగా లేదా సగం ఉడికించిన గుడ్లు తినడం, ఉల్లిపాయలు, బీన్స్, క్యాబేజీ వంటి గ్యాస్ కలిగించే ఆహారాలతో కలిపి తినడం వారికి గ్యాస్ సమస్య వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు గుడ్లను బాగా ఉడికించి తినండి, గుడ్లను మితంగా తీసుకోండి.గ్యాస్ సమస్య కలిగించే ఇతర ఆహారాలతో కలిపి తినవద్దు