Cancer | క్యాన్సర్ రాకుండా అడ్డుకునే “సూపర్ వ్యాక్సిన్” .. శాస్త్ర ప్రపంచంలో సెన్సేషన్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cancer | క్యాన్సర్ రాకుండా అడ్డుకునే “సూపర్ వ్యాక్సిన్” .. శాస్త్ర ప్రపంచంలో సెన్సేషన్!

 Authored By sandeep | The Telugu News | Updated on :15 October 2025,3:09 pm

Cancer | క్యాన్సర్‌ అనే ప్రాణాంతక వ్యాధి రాకముందే దానిని నిరోధించగల వ్యాక్సిన్‌ను అమెరికాలోని మసాచుసెట్స్ అమ్హెర్స్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు సాధించడంతో, ఈ “సూపర్ వ్యాక్సిన్” పై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

#image_title

“సూపర్ అడ్జువెంట్” ఫార్ములా రహస్యం

శాస్త్రవేత్తల ప్రకారం, ఈ కొత్త వ్యాక్సిన్‌ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను అంతగా బలపరుస్తుంది, క్యాన్సర్‌ కణాలు కణితులుగా మారకముందే వాటిని గుర్తించి నాశనం చేయగల సామర్థ్యం కల్పిస్తుంది. ఎలుకలపై చేసిన పరిశోధనల్లో టీకా వేసిన వాటిలో క్యాన్సర్‌ లక్షణాలు ఏవీ కనిపించకపోగా, టీకా వేయని వాటిలో వ్యాధి అభివృద్ధి చెందినట్లు వెల్లడించారు.

ప్రాణాంతక క్యాన్సర్లపై రక్షణ

ఈ సూపర్ వ్యాక్సిన్‌ మెలనోమా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లనూ అడ్డుకునే సామర్థ్యాన్ని చూపిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది కేవలం కొత్త కణితుల ఏర్పాటును నిరోధించడమే కాకుండా, వ్యాధి శరీరమంతా వ్యాపించకుండా కూడా ఆపుతుంది.ఈ వ్యాక్సిన్‌లో ప్రధాన పాత్ర “సూపర్ అడ్జువెంట్” అనే ప్రత్యేక పదార్థానికి ఉంది. ఇది సాధారణ టీకాల కంటే రోగనిరోధక శక్తిని అనేక రెట్లు పెంచి, క్యాన్సర్‌ కణాలపై బలమైన రక్షణను అందిస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది