Women : మహిళల పేరుపై ఇల్లు కొనుగోలు చేస్తే ఎన్ని ప్రయోజనాలో… కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Women : మహిళల పేరుపై ఇల్లు కొనుగోలు చేస్తే ఎన్ని ప్రయోజనాలో… కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్…!

 Authored By ramu | The Telugu News | Updated on :21 June 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Women : మహిళల పేరుపై ఇల్లు కొనుగోలు చేస్తే ఎన్ని ప్రయోజనాలో... కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్...!

Women : ప్రస్తుత కాలంలో చాలామంది వారి జీవితాన్ని విలాసంగా గడిపేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిలో భాగంగానే సొంత ఇల్లు సొంత కారు ఇలా కొన్ని రకాల సదుపాయాలు ఉంటే బాగుంటుందని కలలు కంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా చాలామంది మధ్యతరగతి వారికి సొంతంగా ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలామందికి సొంతంగా ఇల్లు కొనుక్కోవడం అనేది కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. అయితే అసలు ఇంటిని ఎవరి పేరుతో కొనుగోలు చేయడం మంచిది..?వారి పేరు మీద ఎందుకు చేయాలి..?ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Women మహిళల పేరుతో ఇల్లు కొనుగోలు చేస్తే…

కొత్తగా ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలి అనుకుంటే తల్లి లేదా భార్య పేరు మీద కొనుగోలు చేయడం చాలా మంచిదని పలువురు చెబుతుంటే విన్నాం. అయితే పెద్దలు ఈ మాట ఎందుకు చెప్పారో తెలియదు కానీ ప్రస్తుత కాలంలో మహిళల పేరుపై ఆస్థి లేదా ఇల్లు కొనుగోలు చేయడం అనేక రకాల ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది. అది ఎలా అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొన్ని రకాల పథకాలు అని చెప్పవచ్చు. దీనిలో భాగంగానే వడ్డీ తక్కువతో రుణాలను కూడా పొందవచ్చు.

Women లాభాలు ఏంటి…

అయితే మహిళల పేరుపై ఆస్తి లేదా ఇల్లును కొనుగోలు చేసినట్లయితే ప్రస్తుతం బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలను అందిస్తున్నాయి. అంతేకాక రుణాన్ని తిరిగి చెల్లించడానికి తగినంత సమయాన్ని కూడా కేటాయిస్తారు. అంతేకాదు పురుషులతో పోల్చి చూస్తే మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నారు. దీనిలో భాగంగానే సాధారణ మహిళలకు 5 నుండి 10 శాతం వరకు వడ్డీ రేట్లు తక్కువగా ఉంటున్నాయి. ఇదేవిధంగా అన్ని బ్యాంకుల్లో కూడా మహిళలకు వడ్డీరేట్లు కేటాయించబడ్డాయి.

Women మహిళల పేరుపై ఇల్లు కొనుగోలు చేస్తే ఎన్ని ప్రయోజనాలో కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్

Women : మహిళల పేరుపై ఇల్లు కొనుగోలు చేస్తే ఎన్ని ప్రయోజనాలో… కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్…!

అలాగే మహిళలు వారి యొక్క బ్యాంకు క్రెడిట్ స్కోర్ అత్యధికంగా ఉన్నట్లయితే తక్కువ వడ్డీకే రుణాలు పొందుతారు. దీంతో తక్కువ వడ్డీ రేటు ఉన్న రుణాలు తిరిగి చెల్లించడానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి అధిక వడ్డీ రేటు తో బాధ పడాల్సిన అవసరం ఉండదు. అంతేకాక ప్రస్తుతం కొన్ని రకాల సెంట్రల్ బ్యాంకులు ఇంటి కొనుగోలు కోసం ఓ పథకాన్ని కూడా కలిగి ఉన్నాయి కాబట్టి దీనిని ఉపయోగించుకోవడం వలన అతి తక్కువ వడ్డీతో రుణాలను పొందవచ్చు. కాబట్టి మహిళల పేరుపై ఆస్తి లేదా ఇళ్లను కొనుగోలు చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది