మోదీ ఇప్పుడు ఆలోచన చేశారు.. నేనెప్పుడో అమలు చేశా.. మళ్లీ స్టార్ట్ చేసిన బాబు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

మోదీ ఇప్పుడు ఆలోచన చేశారు.. నేనెప్పుడో అమలు చేశా.. మళ్లీ స్టార్ట్ చేసిన బాబు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :11 December 2020,9:46 am

ఇప్పుడు మనం ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. ఒకరు చంద్రబాబు అయితే.. మరొకరు ప్రధాని మోదీ. నిన్ననే మోదీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు తెలుసు కదా. అదేనండి.. కొత్త పార్లమెంట్ భవనం, మంత్రిత్వ శాఖ కార్యాలయాల కోసం శంకుస్థాపన జరిగింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపట్టినందుకు దేశవ్యాప్తంగా మోదీకి అభినందనలు వెల్లువెత్తాయి. చాలామంది రాజకీయ నాయకులు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ విషయంలో ప్రధాని మోదీని అభినందించారు.

chandrababu about central vista project

chandrababu about central vista project

కట్ చేస్తే.. ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా ప్రధాని మోదీని అభినందించారు. చంద్రబాబు అవకాశం వస్తే వదలరు కదా. పనిలో పనిగా మోదీని పొగడ్తల్లో ముంచెత్తి.. తన గురించి కూడా చెప్పుకున్నారు.

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం చేపట్టడం అనేది గొప్ప నిర్ణయం కానీ.. ప్రధాని మోదీ ఇప్పుడు ఆ ఆలోచన చేశారు కానీ.. నేను మాత్రం ఎప్పుడో ఆలోచించా.. ఐదేళ్ల కిందనే అమలు చేశా.. అంటూ మళ్లీ తన గురించి చెప్పుకోవడం మొదలు పెట్టారు చంద్రబాబు.

ఒక రాజధాని అంటూ లేని రాష్ట్రంలో అమరావతి అనే క్యాపిటల్ ను నెలకొల్పి… దాన్ని సెంట్రల్ స్పైన్ గా అభివృద్ధి చేయడం కోసం ఎంతో కృషి చేశా. హైకోర్టు, సచివాలయం, రాజ్ భవన్, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా అన్నీ ఒకే చోట ఉండేలా నేను ప్రణాళికలు రచించా. అలాగే.. ఏపీ ప్రజల ఆకాంక్షలకు… ఏపీ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు, సంక్షేమం కోసం అమరావతిని దేశంలోనే బెస్ట్ క్యాపిటల్ గా తీర్చిదిద్దడం కోసం ఎంతో కృషి చేశానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

కాకపోతే.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అమరావతి క్యాపిటల్ నాశనం అయిందంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.

ఇక్కడ మనం ఆలోచించాల్సినవి మూడు. చంద్రబాబు ఒకేసారి మూడు విషయాలు మాట్లాడేశారు. ఒకటి ప్రధాని మోదీని పొగడటం.. రెండు ప్రస్తుత ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను విమర్శించడం.. మూడోది.. అమరావతి రాజధాని కోసం తను ఎంత కష్టపడ్డారు.. కేంద్రీకృత పరిపాలన కోసం ఎంత కృషి చేశారు అనేది మళ్లీ ప్రజలకు చెప్పుకోవడం.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది