ChandraBabu : పవన్ కళ్యాణ్‌ని తొక్కేయడానికే చంద్రబాబు స్కెచ్.!

ChandraBabu : జనసేన పార్టీకీ, తెలుగుదేశం పార్టీకి వున్న ‘అవినాభావ సంబంధం ఏంటి.?’ అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. సినిమాల్లో మెగా, నందమూరి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు వుంది. సామాజిక వర్గ సమీకరణాల ప్రకారం చూసుకున్నా, మెగా వర్సెస్ నందమూరి అనే రచ్చ ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది కమ్మ – కాపు సామాజిక వర్గాల మధ్య. సినిమాలు వేరు, రాజకీయాల వేరని అనుకోవడానికి వీల్లేదు. ప్రజారాజ్యం పార్టీని అప్పట్లో తొక్కేసింది తెలుగుదేశ పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియా. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.

అయినాగానీ, జనసేన పార్టీ ఎందుకు తెలుగుదేశం పార్టీతో అంట కాగుతోందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఏకపక్షంగా జనసేన వైపుకు వలపు బాణాల్ని తెలుగుదేశం పార్టీ విసురుతోంది. టీడీపీ ఎంతలా జనసేన పార్టీని నాశనం చేస్తున్నా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీకి దాసోహం అవుతూనే వున్నారు. 2019 ఎన్నికల విషయాన్నే తీసుకుంటే, జనసేన పార్టీని దెబ్బకొట్టింది తెలుగుదేశం పార్టీ. ‘పవన్ కళ్యాణ్ మావాడే.. జనసేనకు ఓట్లేస్తే, వైసీపీ లాభపడుతుంది..’ అంటూ టీడీపీ చేసిన దుష్ప్రచారమే జనసేన కొంప ముంచింది. లేకపోతే, హంగ్ అని అనలేంగానీ,

Chandrababu Backstabbing Sketch For Pawan kalyan

జనసేన పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు వచ్చి వుండేవి, రాష్ట్ర రాజకీయాల్లో జనసేన కీలకమయ్యేది. కానీ, జనసేన ఒకే ఒక్క సీటుకు పరిమితమైందంటే, అది టీడీపీ కారణంగానే. గతం గతః రాజకీయాల్లో ముగిసిన అధ్యాయాల గురించి మాట్లాడుకోవడం అనవసరం. 2024 నాటికి అయినా, జనసేన ఒంటరిగా బరిలోకి దిగితే, టీడీపీ నీడ పడకుండా జాగ్రత్త పడితే మాత్రం, ప్రధాన ప్రతిపక్షంగా జనసేన ఎదిగేందుకు ఆస్కారం వుంటుంది. అప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకింత కుదురుగా కనిపిస్తాయి. వైసీపీని దెబ్బ కొట్టే క్రమంలో టీడీపీతో జత్ కట్టాలనుకోవడం కాదు, వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ఆలోచన జనసేన చేస్తే మంచిదేమో.!

Recent Posts

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

18 minutes ago

Periods | పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయకూడదా.. వైద్య నిపుణులు సూటిగా చెప్పే సత్యం ఇదే..!

Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయరాదు,…

1 hour ago

Weight | బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా చదవాల్సిన వార్త.. అరటిపండు,యాపిల్‌ల‌లో ఏది బెస్ట్‌

Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…

2 hours ago

Liver Cancer | కాలేయ క్యాన్సర్ పై అవగాహన పెంపు అవసరం.. ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు

Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…

3 hours ago

Navaratri | నవరాత్రి ప్రత్యేకం: అమ్మవారికి నైవేద్యం సమర్పించడంలో పాటించాల్సిన నియమాలు

Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…

4 hours ago

Xiaomi 17 Pro Max vs iPhone 17 Pro Max | iPhone 17 Pro Maxకి గట్టిపోటీగా Xiaomi 17 Pro Max లాంచ్.. ధరలో అరవై శాతం తక్కువ

Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…

13 hours ago

Bonus | సింగరేణి కార్మికులకు భారీ శుభవార్త .. దీపావళి బోనస్ కూడా ప్రకటించిన కేంద్రం

Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…

15 hours ago

Vijaywada | 5 రోజుల్లో భారీ ఆదాయం.. భ‌క్తులంద‌రికీ ఉచిత ద‌ర్శ‌నాలు5 రోజుల్లో భారీ ఆదాయం.. భ‌క్తులంద‌రికీ ఉచిత ద‌ర్శ‌నాలు

Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…

18 hours ago