ChandraBabu : పవన్ కళ్యాణ్‌ని తొక్కేయడానికే చంద్రబాబు స్కెచ్.!
ChandraBabu : జనసేన పార్టీకీ, తెలుగుదేశం పార్టీకి వున్న ‘అవినాభావ సంబంధం ఏంటి.?’ అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. సినిమాల్లో మెగా, నందమూరి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు వుంది. సామాజిక వర్గ సమీకరణాల ప్రకారం చూసుకున్నా, మెగా వర్సెస్ నందమూరి అనే రచ్చ ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది కమ్మ – కాపు సామాజిక వర్గాల మధ్య. సినిమాలు వేరు, రాజకీయాల వేరని అనుకోవడానికి వీల్లేదు. ప్రజారాజ్యం పార్టీని అప్పట్లో తొక్కేసింది తెలుగుదేశ పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియా. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.
అయినాగానీ, జనసేన పార్టీ ఎందుకు తెలుగుదేశం పార్టీతో అంట కాగుతోందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఏకపక్షంగా జనసేన వైపుకు వలపు బాణాల్ని తెలుగుదేశం పార్టీ విసురుతోంది. టీడీపీ ఎంతలా జనసేన పార్టీని నాశనం చేస్తున్నా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీకి దాసోహం అవుతూనే వున్నారు. 2019 ఎన్నికల విషయాన్నే తీసుకుంటే, జనసేన పార్టీని దెబ్బకొట్టింది తెలుగుదేశం పార్టీ. ‘పవన్ కళ్యాణ్ మావాడే.. జనసేనకు ఓట్లేస్తే, వైసీపీ లాభపడుతుంది..’ అంటూ టీడీపీ చేసిన దుష్ప్రచారమే జనసేన కొంప ముంచింది. లేకపోతే, హంగ్ అని అనలేంగానీ,
జనసేన పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు వచ్చి వుండేవి, రాష్ట్ర రాజకీయాల్లో జనసేన కీలకమయ్యేది. కానీ, జనసేన ఒకే ఒక్క సీటుకు పరిమితమైందంటే, అది టీడీపీ కారణంగానే. గతం గతః రాజకీయాల్లో ముగిసిన అధ్యాయాల గురించి మాట్లాడుకోవడం అనవసరం. 2024 నాటికి అయినా, జనసేన ఒంటరిగా బరిలోకి దిగితే, టీడీపీ నీడ పడకుండా జాగ్రత్త పడితే మాత్రం, ప్రధాన ప్రతిపక్షంగా జనసేన ఎదిగేందుకు ఆస్కారం వుంటుంది. అప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకింత కుదురుగా కనిపిస్తాయి. వైసీపీని దెబ్బ కొట్టే క్రమంలో టీడీపీతో జత్ కట్టాలనుకోవడం కాదు, వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ఆలోచన జనసేన చేస్తే మంచిదేమో.!