అతడికే తిరుపతి ఉపఎన్నిక బాధ్యతను అప్పజెప్పి నెత్తిన తడిగుడ్డ వేసుకున్న చంద్రబాబు?
చంద్రబాబు.. నిజానికి ఆయనకున్న రాజకీయ అనుభవం దేశంలోనే ఎవ్వరికీ లేదు. ఫార్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ. 40 ఏళ్ల రాజకీయ అనుభవం. దాదాపు 14 ఏళ్లు ఆయన ఉమ్మడి ఏపీ, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ.. ఏంటి లాభం. 2019 లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం టీడీపీకి 20 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. ఇది ఇలాగే కొనసాగితే రేపటి రోజున ఏపీలో టీడీపీ అనే పార్టీ గురించి మాట్లాడుకోవడమే తప్పితే.. ఆ పార్టీ మాత్రం ఉండదు. అందుకే.. వెంటనే చంద్రబాబు తన రాజకీయ అనుభవంతో స్ట్రాటజీలను మార్చుతున్నారు.
ఎన్నికలు ఇప్పట్లో లేకున్న సరే.. 2024 ను టార్గెట్ గా చేసుకున్నారు. ఇప్పటి నుంచే 2024 ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ శ్రేణులతో కలిసి శ్రమిస్తున్నారు. ఒకవేళ 2024 లో కూడా టీడీపీ గెలవలేకపోతే.. ఇక టీడీపీ ఖేల్ ఖతమే. ఆ విషయం తెలిసి.. వెంటనే టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా రాబిన్ శర్మను నియమించారు చంద్రబాబు.
రాబిన్ శర్మ ఎవరో తెలుసా?
ఈ రాబిన్ శర్మ ఎవరో కాదు.. వైసీపీ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ లోని సభ్యుడు. ఆ టీం నుంచి బయటికి వచ్చి సపరేట్ గా కంపెనీని పెట్టి నడిపిస్తున్నాడు రాబిన్. దీంతో.. రాబిన్ ను తమ పార్టీకి వ్యూహకర్తగా చంద్రబాబు నియమించుకున్నారు.
ప్రస్తుతం రాబిన్ శర్మకు 2024 ఎన్నికలు కాదు టార్గెట్. త్వరలో రాబోయే తిరుపతి ఉపఎన్నిక. అవును.. తిరుపతి ఉపఎన్నికలో గెలిచి చూపిస్తేనే.. రాబిన్ ను చంద్రబాబు నమ్ముతారు. అందుకే.. తిరుపతి ఉపఎన్నికల్లో తన ప్రమేయం ఏమీ లేకుండా కేవలం రాబిన్ శర్మను మాత్రమే రంగంలోకి దింపారు చంద్రబాబు. ఇప్పటికే రాబిన్ శర్మ.. తిరుపతిలో మకాం వేశారు. అక్కడ ఉన్న అన్ని పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అక్కడి ఓటర్ల నాడిని కూడా తెలుసుకొని.. దాని ఆధారంగా.. వ్యూహ రచన చేస్తున్నారు.
చంద్రబాబు మాత్రం తిరుపతి ఉపఎన్నిక బాధ్యత మొత్తాన్ని రాబిన్ శర్మకు అప్పగించేసి.. ఆయన మాత్రం తడిగుడ్డ వేసుకొని ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఒకవేళ రాబిన్ వ్యూహం ఫలించకుండా తిప్పికొడితే అప్పుడు ఏంటి పరిస్థితి.. అనేది ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమైంది. అప్పుడు రాబిన్ ను చంద్రబాబు నమ్మరు. కానీ.. ఆ తర్వాత 2024 లో వచ్చే ఎన్నికల పరిస్థితి ఏంటి? అంటూ టీడీపీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.