Chandrababu : జగన్ చేస్తున్నదే కరెక్ట్ పరోక్షంగా ఒప్పేసుకున్న చంద్రబాబు..!!
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల పాలకులు ఏపీలో జరుగుతున్న సంక్షేమ పథకాలు అమలు తీరుపై అధ్యయనం చేసి.. వాళ్ల రాష్ట్రాలలో అమలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల వరల్డ్ బ్యాంకు ప్రజా ప్రతినిధులు సైతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విద్యా మరియు వైద్యం విషయంలో జగన్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రశంసించడం కూడా జరిగింది. దేశం మరియు ప్రపంచం జగన్ పాలనను మెచ్చుతూ ఉన్న క్రమంలో… చంద్రబాబు సైతం పరోక్షంగా జై కొట్టారు.
విషయంలోకి వెళ్తే ఇటీవలే హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 41వ టీడీపీ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభకి ఒకరోజు ముందు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతల తీరు మారింది. మేటర్ లోకి వెళ్తే జగన్ ఇస్తున్న పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంతకుముందు చాలామంది టీడీపి నేతలు కామెంట్లు చేశారు. అయితే రీసెంట్ గా తెలుగుదేశం పార్టీ నాయకులే పోలీట్ బ్యూరో సమావేశం.. తరువాత వైసిపి నేతలు తాము వస్తే పథకాలు కట్ చేస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు
తీసే ప్రసక్తి లేదు. అదే సమయంలో వాటికంటే మెరుగైన పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు వైయస్ జగన్ సంక్షేమ పథకాలపై చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం వైయస్ జగన్ ని మాత్రమే విమర్శించారు. సో దీన్ని బట్టి చూస్తే జగన్ చేస్తున్నది కరెక్టే అని పరోక్షంగా చంద్రబాబు ఒప్పుకున్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో పుంజుకోవటం జరిగింది. దీంతో పార్టీ క్యాడర్ మంచి జోష్ మీద ఉంది. ఈ క్రమంలో జగన్ పథకాలపై చంద్రబాబు ఇటువంటి నెగటివ్ కామెంట్లు చేయకుండా చాలా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.