
chandrababu naidu telugu desham party chief nara chandrababu naidu comments on ys jagan about vizag steel plant
chandrababu naidu : ఏపీ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయి. ఒక వైపు బీజేపీ రాష్ట్రంలో జనసేన పార్టీతో కలిసి పాగా వేయాలని భావిస్తుంది. మరో వైపు వచ్చే సారి అయినా తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నాడు. ఇక వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవ్వాలని వైకాపాను మరింత బలంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు అన్నట్లుగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాని కొన్ని సార్లు ముందు ఉన్న అవకాశంను వదిలేసి ఏదో విషయాన్ని పట్టుకుని వేలాడటం జరుగుతుంది. ఈ విషయం ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుందని అంటున్నారు.
chandrababu naidu telugu desham party chief nara chandrababu naidu comments on ys jagan about vizag steel plant
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు. అలాంటి ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేపట్టేందుకు సిద్దం అయ్యింది. ఇలాంటి సమయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా బీజేపీపై తిరగబడే ప్రయత్నం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడంతో పాటు తన ఎంపీలతో పార్లమెంట్ లో దద్దరిల్లేలా చేశారు. దాంతో వైఎస్ జగన్ కు ఈ విషయంలో మైలేజ్ దక్కినట్లు అయ్యింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాధ్యం అయినంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాం అంటూ ప్రకటన చేశాడు. కాని చంద్రబాబు నాయుడు మాత్రం ఆ విషయంలో పెద్దగా స్పందన లేకుండా ఉన్నాడు. ట్విట్టర్ లో కాస్త హడావుడి చేసి అక్కడ నుండి కనిపించడం లేదు అంటున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రధాన కారణం నష్టాలు అంటూ చెబుతూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది. ఇలాంటి సమయంలో తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు మోడీపై విరుచుకు పడాలి. ఆయన్ను చీల్చి చెండాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం కేంద్రంపై కంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కువగా విమర్శలు చేస్తున్నాడు. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు విషయమై టీడీపీ ఆశలు పెట్టుకుంది. అందుకే చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంను కాకుండా రాష్ట్ర ప్రభుత్వంను టార్గెట్ చేస్తున్నాడు. రాష్ట్రంలో వైకాపాను టార్గెట్ చేయడం వల్ల తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు వెళ్లువెత్తడం తప్ప మరేం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.