
#image_title
Chandrababu : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనేక రకాల రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు సర్ప్రైజ్ ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మూడు విడతలలో జాబితాలను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ మూడు జాబితాలలో గంటాకు టికెట్ దక్కలేదు. దీంతో గంట వర్గం తీవ్ర ఆందోళనలో ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే గంటాను చీపురుపల్లి వెళ్ళమని బాబు కోరుతున్నట్లుగా తెలుస్తోంది.అయితే బాబు మాటకు గంటఆ నో చెప్పారని తనకు భీమిలి టికెట్ ఇస్తేనే గెలిచి చూపిస్తానని హామీ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే గంటాకు భీమిలి సీటు లేదని చంద్రబాబు కూడా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
కానీ ఇప్పుడు భీమిలి టికెట్ ను గంటాకు ఖరారు చేస్తూ చంద్రబాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే గంటాకు ఈ భీమిలి టికెట్ దక్కడం వెనుక ఆయన యొక్క సామాజిక వర్గం పనిచేసిందని అంటున్నారు. అంతేకాక టీడీపీ ఇప్పటివరకు ప్రకటించిన మూడు జాబితాలలో కాపు వర్గానికి చెందిన అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో అది గంటాకు బాగా కలిసి వచ్చినట్లుగా తెలుస్తోంది. పైగా భీమిలి నియోజకవర్గం లో గంటా అభ్యర్థి అయితేనే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ను ఓడించగలరని తాజాగా టీడీపీ చేయించిన సర్వేలో వెళ్లడైంది. ఈ క్రమంలోనే గంటాకు చంద్రబాబు భీమిలి సీట్ పై సంకేతాలు ఇచ్చారని ఆయనని అక్కడ పనిచేసుకోమని కోరినట్టుగా అంటున్నారు. ఈ క్రమంలోనే గంటా కూడా తన నియోజకవర్గం లో పనులను మొదలుపెట్టినట్లుగాా తెలుస్తుంది.
ఇది ఇలా ఉంటే భీమిలిలో గంటా పోటీ చేసినట్లయితే ఇద్దరి మధ్య పోరు హోరా హోరి గా సాగుతుందని అంటున్నారు. అయితే మంత్రి అవంతి శ్రీనివాసరావు గంటాకు ఒక అప్పుడు మంచి నేస్తం. అంతేకాదు ఆయనను గంటానే రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. అయితే 2019లో భీమిలి సీట్ పై వచ్చిన కొన్ని సమస్యల్ వలన అవంతి వైసీపీ పార్టీలోకి చేరి ఆ పార్టీలో టికెట్ దక్కించుకున్నారు. ఆపై మంత్రి కూడా అయిపోయారు. అయితే టీడీపీలో కొనసాగుతున్న గంటాకు మాత్రం టీడీపీ టికెట్ ఇవ్వకుండా చివరి నిమిషంలో విశాఖ ఉత్తరం ఇచ్చారు. దీంతో ఆయన గెలిచారు కానీ పార్టీ ఓడిపోయింది. దీంతో గత ఐదేళ్లపాటు మాజీ మంత్రిగా గంటా గడిపారు. ఇక ఇప్పుడు టీడీపీ కూటమి గెలిచినట్లయితే మరోసారి మంత్రిగా గంటా చాలామని అవుతారు. అందుకే ఆయన భీమిలి నుంచి పోటీకి తయారవుతున్నట్లు తెలుస్తోంది. మరి భీమిలి లో గంట వర్సెస్ అవంతిల మధ్య పోటీ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.