Chandrababu : గంట శ్రీనివాసరావుకు చంద్రబాబు గుడ్ న్యూస్…భీమిలి నుండి పోటీ…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : గంట శ్రీనివాసరావుకు చంద్రబాబు గుడ్ న్యూస్…భీమిలి నుండి పోటీ…!!

Chandrababu : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనేక రకాల రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు సర్ప్రైజ్ ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మూడు విడతలలో జాబితాలను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ మూడు జాబితాలలో గంటాకు టికెట్ దక్కలేదు. దీంతో గంట వర్గం తీవ్ర ఆందోళనలో ఉందని చెప్పాలి. […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 March 2024,8:00 am

Chandrababu : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనేక రకాల రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు సర్ప్రైజ్ ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మూడు విడతలలో జాబితాలను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ మూడు జాబితాలలో గంటాకు టికెట్ దక్కలేదు. దీంతో గంట వర్గం తీవ్ర ఆందోళనలో ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే గంటాను చీపురుపల్లి వెళ్ళమని బాబు కోరుతున్నట్లుగా తెలుస్తోంది.అయితే బాబు మాటకు గంటఆ నో చెప్పారని తనకు భీమిలి టికెట్ ఇస్తేనే గెలిచి చూపిస్తానని హామీ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే గంటాకు భీమిలి సీటు లేదని చంద్రబాబు కూడా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

కానీ ఇప్పుడు భీమిలి టికెట్ ను గంటాకు ఖరారు చేస్తూ చంద్రబాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే గంటాకు ఈ భీమిలి టికెట్ దక్కడం వెనుక ఆయన యొక్క సామాజిక వర్గం పనిచేసిందని అంటున్నారు. అంతేకాక టీడీపీ ఇప్పటివరకు ప్రకటించిన మూడు జాబితాలలో కాపు వర్గానికి చెందిన అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో అది గంటాకు బాగా కలిసి వచ్చినట్లుగా తెలుస్తోంది. పైగా భీమిలి నియోజకవర్గం లో గంటా అభ్యర్థి అయితేనే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ను ఓడించగలరని తాజాగా టీడీపీ చేయించిన సర్వేలో వెళ్లడైంది. ఈ క్రమంలోనే గంటాకు చంద్రబాబు భీమిలి సీట్ పై సంకేతాలు ఇచ్చారని ఆయనని అక్కడ పనిచేసుకోమని కోరినట్టుగా అంటున్నారు. ఈ క్రమంలోనే గంటా కూడా తన నియోజకవర్గం లో పనులను మొదలుపెట్టినట్లుగాా తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే భీమిలిలో గంటా పోటీ చేసినట్లయితే ఇద్దరి మధ్య పోరు హోరా హోరి గా సాగుతుందని అంటున్నారు.  అయితే మంత్రి అవంతి శ్రీనివాసరావు గంటాకు ఒక అప్పుడు మంచి నేస్తం. అంతేకాదు ఆయనను గంటానే రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. అయితే 2019లో భీమిలి సీట్ పై వచ్చిన కొన్ని సమస్యల్ వలన అవంతి వైసీపీ పార్టీలోకి చేరి ఆ పార్టీలో టికెట్ దక్కించుకున్నారు. ఆపై మంత్రి కూడా అయిపోయారు. అయితే టీడీపీలో కొనసాగుతున్న గంటాకు మాత్రం టీడీపీ టికెట్ ఇవ్వకుండా చివరి నిమిషంలో విశాఖ ఉత్తరం ఇచ్చారు. దీంతో ఆయన గెలిచారు కానీ పార్టీ ఓడిపోయింది. దీంతో గత ఐదేళ్లపాటు మాజీ మంత్రిగా గంటా గడిపారు. ఇక ఇప్పుడు టీడీపీ కూటమి గెలిచినట్లయితే మరోసారి మంత్రిగా గంటా చాలామని అవుతారు. అందుకే ఆయన భీమిలి నుంచి పోటీకి తయారవుతున్నట్లు తెలుస్తోంది. మరి భీమిలి లో గంట వర్సెస్ అవంతిల మధ్య పోటీ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది