#image_title
chia seeds | ఆధునిక ఆరోగ్య ఆహారాల్లో ప్రముఖంగా ప్రాచుర్యంలోకి వచ్చిన చియా గింజలు (Chia Seeds) నిజంగా పోషక విలువలతో నిండినవే. వాటిలో ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండి, ఇది ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. కానీ నిపుణులు హెచ్చరిస్తున్నారు
#image_title
చియా గింజలు తినేటప్పుడు జాగ్రత్తలు ఎందుకు అవసరం?
నేరుగా తినకూడదు!
నిపుణుల ప్రకారం, చియా గింజలు నీటిని పీల్చుకునే గుణం కలిగి ఉంటాయి. అవి నేరుగా తిన్నపుడు గొంతులో లేదా ఆహారనాళంలో ఉబ్బిపోతూ చిక్కుకుపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఊపిరాడకపోవడానికి కూడా కారణమవుతుంది.
ముందుగా నీటిలో నానబెట్టాలి
చియా గింజలను కనీసం 20-30 నిమిషాలు నీటిలో లేదా పాలలో నానబెట్టి తినాలి. ఇలా చేయడం వల్ల అవి జీర్ణవ్యవస్థలో సులభంగా కలిసిపోతాయి.
రోజుకు 1–2 టీ స్పూన్లు మాత్రమే
ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలు రావచ్చు. అందుకే నిపుణులు సూచించే పరిమితి లోపలే తినాలి.
తగినంత నీరు తాగాలి
చియా గింజల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ నుంచి నీటిని పీల్చుకుంటుంది. అందుకే వాటిని తినిన తర్వాత తగినంత నీరు త్రాగడం తప్పనిసరి.
నిద్రపోయే ముందు తినకూడదు
చియా గింజల్లోని ఫైబర్ కారణంగా జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. దీని వల్ల నిద్రపోయే సమయంలో అసౌకర్యం, పొట్ట ఉబ్బిపోవడం, తరచూ బాత్రూమ్‌కు వెళ్లడం లాంటి సమస్యలు రావచ్చు. ఉదయం లేదా మధ్యాహ్నం వాటిని తీసుకోవడం ఉత్తమం.
కొన్ని మందులు వాడే వారు జాగ్రత్త
బీపీ, షుగర్, రక్తం పలుచబెట్టి మందులు తీసుకుంటున్నవారు చియా గింజలు తినేటప్పుడు జాగ్రత్త పాటించాలి.
చియా గింజలు రక్తాన్ని పలుచబెట్టే, బ్లడ్ షుగర్ తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. ఇది మందుల ప్రభావాన్ని పెంచడం వల్ల ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చు.
బిగ్బాస్ తెలుగు సీజన్ 9 మునుపెన్నడు లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామనర్స్, సెలబ్రెటీలను బిగ్బాస్…
BRS | రాబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) BRS కీలక నిర్ణయం తీసుకున్నట్లు…
Health Tips : ఈ మోడరన్ లైఫ్‌స్టైల్‌లో ఎక్కువమంది జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అన్నం తిన్న వెంటనే అజీర్ణం,…
Manila tamarind | మనకు సుపరిచితమైన సీమ చింతకాయ (Velvet Tamarind) ఇప్పుడు సూపర్ ఫుడ్స్ జాబితాలోకి చేరుతోంది. చిన్నచిన్న నల్లని…
Honey | ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతిసిద్ధమైన పదార్థాల్లో తేనె (Honey) అగ్రస్థానం లో ఉంటుంది. తియ్యటి రుచి కలిగి…
Cauliflower |కాలీఫ్లవర్‌ను చాలా మంది ఆరోగ్యకరమైన కూరగాయగా పరిగణించి తరచూ తినే అలవాటు కలిగి ఉంటారు. ఇందులో విటమిన్ సి,…
Neem tree | ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్య పరంగా, జ్యోతిషశాస్త్ర పరంగా ఎంతో ప్రత్యేకత కలిగిన వేప చెట్టు గురించి…
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
This website uses cookies.