Chicken Vepudu Recipe : క్యాటరింగ్ స్టైల్లో చికెన్ వేపుడు.. తినే కొద్ది తినాలనిపిస్తుంది.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chicken Vepudu Recipe : క్యాటరింగ్ స్టైల్లో చికెన్ వేపుడు.. తినే కొద్ది తినాలనిపిస్తుంది..

 Authored By prabhas | The Telugu News | Updated on :20 August 2022,9:00 pm

Chicken Vepudu Recipe : చికెన్ అంటే సహజంగా అందరూ ఇష్టపడి తింటుంటారు. అయితే కొన్ని సమయాలలో మనం ఎక్కడికైనా ఫంక్షన్స్ కి కానీ పెళ్లిళ్లు కానీ వెళ్లినప్పుడు అక్కడ చికెన్ వెరైటీస్ గా చేస్తూ ఉంటారు. ఆ చికెన్ వేపుడు చాలా రుచిగా ఎంతో టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. అది ఎలా చేస్తారు ఇంత రుచిగా వస్తుంది. అని అనుకుంటూ ఉంటాం.. ఇప్పుడు మనం అలాంటి చికెన్ వేపుడుని ఎలా తయారు చేయాలో చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు; చికెన్ ,ఉప్పు ,పసుపు, ఆయిల్, కొత్తిమీర, కసూరి మేతి ,చికెన్ మసాలా, కారం, ధనియాలు దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, ఒక కప్పు టమాటాలు, అరకప్పు ఉల్లిపాయలు మొదలైనవి..

తయారీ విధానం; ముందుగా ఒక కడాయి తీసుకుని దానిలో ఒక కేజీ చికెన్ వేసి దానిలో రాళ్ల ఉప్పు ఒక స్పూన్, పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత దాంట్లో వాటర్ అంతా ఇన్ని కే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత రెండు గరిటెల ఆయిల్ ను వేసుకోవాలి. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు టమాట ముక్కలు, రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి.

Chicken Vepudu Recipe video on youtube

Chicken Vepudu Recipe video on youtube

ఇది అవుతుండగా ఒక కడాయిలో నాలుగు స్పూన్ల ధనియాలు, ఒక దాల్చిన చెక్క, రెండు యాలకులు, రెండు లవంగాలు, రెండు స్పూన్ల మిరియాలు, వేసి బాగా వేయించుకొని వాటిని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెండు స్పూన్ల కారం, ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న మసాలా పౌడర్ ను దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కసురు మేతిని బాగా నలిపి దానిలో వెయ్యాలి. తర్వాత ఒక రెండు స్పూన్ల చికెన్ మసాలా వేసి బాగా తిప్పుతూ ఉండాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దింపే ముందు కొత్తిమీర వేసి దింపుకోవాలి అంతే క్యాటరింగ్ స్టైల్ చికెన్ వేపుడు రెడీ..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది