విషాదం Breaking : వేడి వేడి సాంబార్ లో పడి బాలుడు మృతి..!
విషాదం : ఖమ్మం జిల్లాల్లో విషాదం చోటు చేసుకుంది. వేడి సాంబార్‌లో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలో నర్సింహులపేట మండలానికి చెందిన ఓ కుటుంబం వారం రోజుల క్రితం తమ దగ్గరి బంధువుల ఇంట్లో నిర్వహిస్తున్న అయ్యప్ప ఇరుముడి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చారు.
కార్యక్రమం జరుగుతూ ఉండగా… ఆ కుటుంబానికి చెందిన బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వెళ్లి వేడి సాంబర్ పాత్రలో పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. కాగా వారం రోజులపాటు చికిత్స పొందిన బాలుడు పరిస్థితి విషమించడంతో నేడు ప్రాణాలు విడిచాడు.

Child deid while he dip into sambar dish in khammam district
అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లాడు తమ కళ్ల ముందే విగత జీవిగా మారడం చూసి ఆ తల్లిదండ్రులు భోరున విలపించారు. చిన్నారి మృతితో ఇరు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.