Acharya : అదరగొట్టిన అన్నయ్య.. లాహే లాహే పాటకు చిరు స్టెప్పులు అదుర్స్.. ఇదిగో ఫుల్ లిరికల్ సాంగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Acharya : అదరగొట్టిన అన్నయ్య.. లాహే లాహే పాటకు చిరు స్టెప్పులు అదుర్స్.. ఇదిగో ఫుల్ లిరికల్ సాంగ్

Acharya : తెలుగు ఇండస్ట్రీ ఎప్పటికీ మరిచిపోని నటుడు, తెలుగు సినిమా చరిత్రలో మిగిలిపోయే నటుడు ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఒక డ్యాన్స్, ఒక ఫైట్.. ఒక సెంటిమెంట్.. ఒక మాస్ లుక్.. ఇలా.. తెలుగు సినిమా ప్రేక్షకులకు వీటిని పరిచయం చేసిందే చిరంజీవి. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం చిరంజీవిని మరిచిపోదు. తెలుగు ప్రేక్షకులు […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :31 March 2021,4:10 pm

Acharya : తెలుగు ఇండస్ట్రీ ఎప్పటికీ మరిచిపోని నటుడు, తెలుగు సినిమా చరిత్రలో మిగిలిపోయే నటుడు ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక ట్రెండ్ సెట్ చేశారు.

chiranjeevi acharya movie folk melody laahe laahe released

chiranjeevi acharya movie folk melody laahe laahe released

ఒక డ్యాన్స్, ఒక ఫైట్.. ఒక సెంటిమెంట్.. ఒక మాస్ లుక్.. ఇలా.. తెలుగు సినిమా ప్రేక్షకులకు వీటిని పరిచయం చేసిందే చిరంజీవి. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం చిరంజీవిని మరిచిపోదు. తెలుగు ప్రేక్షకులు కూడా చిరంజీవిని ఎంతో అభిమానిస్తారు. ఇండస్ట్రీకి ఆయన ఒక పెద్ద దిక్కులా ఉండటం… ఈ వయసులో కూడా సినిమాలు తీస్తూ తన అభిమానులను అలరించడం అనేది అంత ఈజీ కాదు. అయినప్పటికీ.. సినిమాలు తీస్తున్నారు. ప్రేక్షకులను అలరిస్తున్నారు.

చిరంజీవి ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ లాంటివి ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. అవి సోషల్ మీడియాలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవలే లాహే లాహే అనే సాంగ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో చిరు వేసిన స్టెప్పులు చూసి అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి స్టెప్పులేయడంతో అందరూ మైమరిచిపోతున్నారు. అన్నయ్య స్టెప్పులకు ఫిదా అవుతున్నారు..

లాహే లాహే ప్రోమోలో చిరు కేవలం ఒకే ఒక స్టెప్పు వేసినా.. ఆ స్టెప్పుకు ఈల వేసి గోల చేయకుండా ఉండలేకపోతున్నారు చిరు అభిమానులు. ఎప్పుడు ఆ పాటకు సంబందించిన ఫుల్ సాంగ్ వస్తుందా? అని అంతా వెయిట్ చేస్తుండగా… తాజాగా ఆ పాటకు సంబంధించిన ఫుల్ సాంగ్ ను విడుదల చేసింది మూవీ యూనిట్.

ప్రోమో కేవలం 15 సెకండ్లు ఉంటేనే చిరు అభిమానులు తట్టుకోలేకపోయారు. ఇక ఫుల్ సాంగ్ వచ్చాక చిరు అభిమానులు ఆగుతారా? రెచ్చిపోతున్నారు. తాజాగా విడుదలైన లాహే లాహే ఫుల్ సాంగ్ యూట్యూబ్ లో సంచలనాలను సృష్టిస్తోంది.

ఈ పాట కోసం సపరేట్ సెట్ వేసి 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించారట డైరెక్టర్ కొరటాల శివ. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. పూర్తిగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా వస్తోంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది