Chiranjeevi : సీపీఐ నారాయణను క్షమించేసిన మెగాస్టార్ చిరంజీవి.?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవినీ, మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్నీ చేతులెత్తి వేడుకున్నారు సీపీఐ నారాయణ. ‘దండం’ కూడా పెట్టారు. కానీ, అంతటి అగత్యం ఎందుకు నారాయణకు పట్టింది.? అంటే, చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత.. అని చెప్పాల్సి వుంటుంది. సీపీఐ నారాయణకి కొంత నోటి దురుసుతనం ఎక్కువ. ఎప్పుడూ ఎవరో ఒకర్ని తూలనాడుతుంటారు. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే కావొచ్చు. కానీ, చిరంజీవి అభిమానులు తీవ్రంగా నొచ్చుకున్నారు. బహుశా చిరంజీవి కూడా కొంత కలత చెంది వుండొచ్చు నారాయణ వ్యాఖ్యలతో.
‘బ్రోకర్’ అనే పదం నారాయణ వాడి వుండకూడదు. అసలు చిరంజీవి ప్రస్తావనే తెచ్చి వుండకూడదు. ‘బ్రోకర్ నారాయణ..’ అంటూ కోనసీమలో ఆయన పర్యటించినప్పుడు కొందరు యువకులు నినాదాలు చేయడంతో, పాపం నారాయణ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సీపీఐ పార్టీ అధిష్టానమే చీవాట్లు పెట్టిందో, జనంలో తిరగలేనన్న భావన ఆయనకే స్వయంగా కలిగిందో.. ఎలాగైతేనేం, ఆయన క్షమాపణ చెప్పేశారు. ఆ క్షమాపణను యాక్సెప్ట్ చేస్తున్నట్లు నాగబాబు ట్వీట్ చేశారు కూడా.
అయితే, తెరవెనుకాల పెద్ద కథే నడిచిందనీ, నారాయణ తీరుతో నొచ్చుకున్న చిరంజీవి, తన అసహనాన్ని ఎవరి దగ్గర వెల్లగక్కాల్లో వాళ్ళ దగ్గరే వెల్లగక్కారనీ, ఆ విషయం నారాయణ దాకా వెళ్ళి, ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పారనీ అంటున్నారు. కానీ, చిరంజీవి అలా చేస్తారా.? అన్నదే అసలు ప్రశ్న. తప్పదు, తనకన్నా తన అభిమానులు ఎక్కువ బాధ పడినప్పుడు, చిరంజీవి కూడా ఇలాంటి విషయాల్లో బాధ్యత తీసుకోవాలి.. బాధ్యత తప్పినవాళ్ళకు తనదైన మార్గంలో బుద్ధి చెప్పాల్సిందే.