Chitti Puri Recipe : అందరూ పూరీలు చేసుకుంటుంటారు దానికి కాంబినేషన్ పూరి కర్రీ ఆలు కర్రీ ఇలా లేదా పళ్లీ చట్నీ ఇలా చేస్తూ ఉంటారు. అయితే అలా కాకుండా ఇప్పుడు మనం పూరీలకి కాంబినేషన్ చికెన్ కర్రీ చేసుకొని చేద్దాం.. దీన్ని ఒక్కసారి తినాలంటే అస్సలు మర్చిపోరు.. దీనికి కావాల్సిన పదార్థాలు : గోధుమపిండి, ఉప్పు, ఆయిల్, చికెన్ కర్రీ కోసం,చికెన్, కారం,పసుపు, ధనియాలు,ఉల్లిపాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండి కొబ్బరి, గసగసాలు, మిరియాలు,యలుకులు,టమాటాలు,అనాస,పచ్చిమిర్చి,నల్ల యాలుకు మెదలైనవి…
దీని తయారీ విధానం : ముందుగా నీటుగా కడిగి తీసుకున్న చికెన్ ని ఒక బౌల్లో వేసి దీనిలో రెండు స్పూన్ల కారం, కొంచెం పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ గట్టి పెరుగు, ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక గంట వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కాడాయి పెట్టుకుని దానిలో ఆరేడు ఎండుమిర్చి వేసి కొంచెం ధనియాలు, కొంచెం గసగసాలు, కొంచెం మిరియాలు, ఒక దాల్చిన చెక్క, రెండు లవంగాలు, రెండు యాలకులు, ఒక అనాసపు ఒక నల్లయాలకు కొంచెం జీలకర్ర కొంచెం సోంపు వేసి వేయించుకోవాలి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని దాంట్లో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పెద్ద కప్పు ఉల్లిపాయల్ని వేసి ఎర్రగా వేయించుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానిలో కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత మసాలా పట్టించిన చికెన్ కూడా వేసి బాగా ఉడకనివ్వాలి.
ఇంకొకపక్క ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలను కొంచెం నీళ్లు వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న బ్రౌన్ ఆనియన్ వేసి మెత్తటి పేస్టులా పట్టుకుని దాన్ని ఉడుకుతున్న చికెన్ లో వేసి. బాగా కలుపుకోవాలి. ఇక ఈ చికెన్ లో కొంచెం కారం వేసి కలుపుకోవాలి. ఇక దానిలో ఉడికించి స్మాష్ చేసుకున్న టమాటాలను కూడా దాంట్లో వేయాలి. ఇక దాంట్లో వేడివేడి నీళ్లను పోసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇక అంతే చికెన్ కర్రీ రెడీ దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక పూరి కోసం రెండు కప్పుల పిండిని తీసుకొని దానిలో కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసి సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఈ పిండిని పది నిమిషాలు పాటు పక్కన పెట్టుకొని తర్వాత పెద్ద పురిలా వత్తుకొని దానిలో ఒక గిన్నె సహాయంతో చిన్నచిన్న పూరీల్లా కట్ చేసుకుని దానిని ఆయిల్ లో వేయించుకొని తీయడమే అంతే సింపుల్గా చిట్టి పూరి దాని కాంబినేషన్ చికెన్ కర్రీ ఒక్కసారి తింటే టేస్ట్ అదిరిపోద్ది..
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.