Coconut flower | కొబ్బరి పువ్వు ఆరోగ్యానికి అమూల్యమైన వరం.. నిపుణుల అభిప్రాయంఏంటేంటే..!
Coconut flower | కొబ్బరి మరియు కొబ్బరి నీటిని ఆరోగ్యానికి మంచిదని తెలుసుకున్న మనం, ఇప్పుడు కొబ్బరి పువ్వు (Sprouted Coconut) ప్రయోజనాలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అద్భుతమైన పోషక విలువలతో మెండుగా ఉండే ఈ పండు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.
ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు:
జీర్ణక్రియ మెరుగవుతుంది
కొబ్బరి పువ్వులో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థను సజావుగా ఉంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది.
శరీర హైడ్రేషన్‌కు సహాయపడుతుంది
ఇందులో ఉండే సహజ ఎలక్ట్రోలైట్లు వేసవి కాలంలో శరీరాన్ని తేమగా ఉంచుతాయి, దాహాన్ని తగ్గిస్తాయి.

#image_title
బరువు తగ్గడంలో మద్దతు
ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ తినకుండానే ఆకలి నియంత్రించవచ్చు.
థైరాయిడ్ & మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు
ఇది థైరాయిడ్ ఫంక్షన్‌ను సమతుల్యం చేస్తుంది. మూత్రపిండాలు, మూత్రాశయ సంక్రమణల నివారణలో సహాయపడుతుంది.
తక్షణ శక్తిని అందిస్తుంది
ఇందులోని థయామిన్, నియాసిన్, ఫోలేట్ శరీరానికి తక్షణ శక్తిని అందించి శ్రమను తగ్గిస్తాయి. రోజంతా చురుకుగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదు
యాంటీఆక్సిడెంట్ల ప్రభావంతో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వలన శరీర కణాలు ఆరోగ్యంగా ఉండి, క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షణ కలుగుతుంది.
గుండె ఆరోగ్యానికి మేలు
పొటాషియం, మాగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటు నియంత్రణకు ఉపయోగపడతాయి. గుండెపోటు వంటి సమస్యల్ని నివారించడంలో ఇది బలమైన సహాయకారి.