Coolie 1 Day Collections | కూలీ దండ‌యాత్ర‌.. తొలి రోజు క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Coolie 1 Day Collections | కూలీ దండ‌యాత్ర‌.. తొలి రోజు క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :15 August 2025,12:00 pm

Coolie 1 Day Collections | సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’తో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుద‌లై భారీ వసూళ్లు సాధించింది. ఇండియన్ మార్కెట్టులో కంటే ఓవర్సీస్ మార్కెట్టులో ‘కూలీ’ దుమ్ము దులిపింది. ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి 75 కోట్ల రూపాయలు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియన్ మార్కెట్టు నుంచి 65 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిసింది. దాంతో మొత్తం మీద 140 కోట్ల రూపాయల మార్క్ దాటింది ‘కూలీ’.

అద‌ర‌గొట్టేశాడు..

#image_title

‘కూలీ’కి మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ లభించింది కానీ సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ మాత్రం రాలేదు. మూవీకి మిక్స్డ్ టాక్ లభించింది. రివ్యూస్ సైతం గొప్పగా రాలేదు. ‘కూలీ’కి, ఈ వారం థియేటర్లలోకి వచ్చిన సినిమాలకు లాంగ్ వీకెండ్ కలిసి వచ్చే అంశం. రిలీజ్ సెకండ్ డే ఆగస్టు 15 కావడం వల్ల జనాలకు హాలిడే ఉంటుంది. సో ఫ్యాన్స్ థియేటర్లకు వస్తారు.

మౌత్ టాక్ ఎఫెక్ట్ పాజిటివ్ వేలో ఉంటే శని, ఆది వారాలలోనూ కలెక్షన్లకు ఢోకా ఉండదు. నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తే వీకెండ్ తర్వాత తగ్గుతుంది. చిత్రంలో కింగ్ అక్కినేని నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, కన్నడ హీరోయిన్ రచితా రామ్ వంటి బలమైన స్టార్ కాస్ట్ ఉండటం వల్ల అన్ని భాషల ప్రేక్షకులు సినిమాపై ఆస‌క్తి చూపుతున్నారు.

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది