Gold Chain : ఆవును భారతీయులకు అత్యంత ప్రియమైనది. గోమాత అని పిలుస్తూ..ఆవును పూజ చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇకపోతే ఆవును ఇంటి లోపల గృహ ప్రవేశం సందర్భంగా ఇంటి లోనికి తీసుకెళ్లడం మన పూర్వీకుల దగ్గరి నుంచి వచ్చిన ఆచారం. ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతోంది. ఈ విషయాన్ని మనం గమనించొచ్చు కూడా. ఈ సంగతులు పక్కనబెడితే.. ఓ ఆవు వింత పని చేసిందండోయ్.. ఇంతకీ ఏం చేసిందంటే..కర్నాటక రాష్ట్రంలో ఓ వింత ఘటన జరిగింది. ఆవు గోల్డ్ చెయిన్‌ను మింగేసింది.
ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే..కర్నాటక స్టేట్‌లోని ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్ సిర్సి తాలూకా హీపనహల్లి అనే ప్రాంతంలో ఉంటున్న శ్రీకాంత్ హెగ్డె కుటుంబానికి నాలుగేళ్ల వయస్సు ఉన్న ఓ ఆవు, దానికి దూడ ఉన్నాయి. వీరు గోమాత అంటూ ఆవును ప్రత్యేకంగా పూజిస్తుంటారు. ఆవుల కోసం సెపరేట్‌గా పూజలు చేశారు. దీపావళి సందర్భంగా ఆవులకు ప్రత్యేకమైన పూజలు చేశారు. ఈ క్రమంలోనే ఆవులను అత్యంత సుందరంగా అలంకరించారు. ఆవులకు పూల మాలలు వేయడంతో పాటు బంగారు ఆభరణాలూ వేశారు. కాగా, అనుకోకుండా దూడకు వేసిన గోల్డ్ చెయిన్‌ను తీసేయడం మరిచిపోయారు. దాంతో అది పూల మాలలో కలిసి ఎక్కడ పడిందోనని వెతకడం ప్రారంభించారు.
దాదాపుగా ఆవుల షెడ్డు, పేడ, ఇతర ప్రదేశాల్లో వెతుకుతున్నారు. ఎంతకీ దొరకకపోడంతో ఆవు మింగేసిందేమోననే అనుమానం వచ్చింది. దాంతో వెంటనే ఆవు యజమాని వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆవును పరీక్షించి చూడగా, ఆవు పొట్టలో గోల్డ్ చెయిన్ ఉన్నట్లు గుర్తించారు.
దాంతో ఇక సర్జరీ చేసి గోల్డ్ చెయిన్ బయటకు తీశారు. 20 గ్రాములు ఉండాల్సిన చెయిన్ 18 గ్రాములకు వచ్చింది. మిగిలిన రెండు గ్రాములు ఆవుపొట్ట లోపల రిలీజ్ చేసిన యాసిడ్స్ వల్ల కరిగిపోయిందని వైద్యుడు వివరించాడు.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.