CPI Narayana : పవన్‌ కళ్యాణ్ ఓ ‘బఫూన్’ – నారాయణ సంచలన వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CPI Narayana : పవన్‌ కళ్యాణ్ ఓ ‘బఫూన్’ – నారాయణ సంచలన వ్యాఖ్యలు

 Authored By sudheer | The Telugu News | Updated on :25 August 2025,5:00 pm

CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభమైన సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ఆయన పాల్గొని, ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లను కడిగిపారేశారు. చంద్రబాబును “స్వార్థపరుడు”గా అభివర్ణించగా, పవన్‌ను “బఫూన్”, “ఊసరవెల్లి” అంటూ కఠిన పదజాలంతో విమర్శించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరి స్థిరంగా లేదని, పూటకో మాట మాట్లాడతాడని నారాయణ దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా నారాయణ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపైనా దూకుడుగా కామెంట్స్ చేశారు. పవన్ సనాతన ధర్మాన్ని సమర్థించడం తప్పుడు అని, ఆయన నిజంగా ఆ ధర్మం అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించారు. “సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యను కూడా ఆ చితి మంటల్లో వేయడం. నువ్వు చస్తే నీ భార్యను చితిలో వేయగలవా?” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పవన్‌ను “మనిషి అనాలా, జంతువు అనాలా?” అంటూ దూషించారు. కుక్కలకైనా ఒక పాలసీ ఉంటుందని, కానీ పవన్‌కు అంతకీ లేదని నారాయణ అన్నారు.

నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవన్ అభిమానులు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

    sudheer

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది