Curry Leaves | ఈ ఆకుతో డయాబెటిస్ హుష్ కాక్.. కరివేపాకులో ఇన్ని వైద్య గుణాలు దాగున్నాయా..!
Curry Leaves | రోజువారీ వంటల్లో సుగంధాన్ని పెంచే కరివేపాకు ఆకులకి, అసలు మనం ఇచ్చే గౌరవం తక్కువే అనిపించొచ్చు.కానీ ఇదే కరివేపాకు ఆకు అనేక అనారోగ్య సమస్యలకు నివారకం, ఆరోగ్యానికి రక్షకవలయంగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

#image_title
పోషక విలువలు – ఔషధ గుణాలు
కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, ఫైబర్, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ E, కాల్షియం వంటి ఎన్నో పోషకాలుంటాయి. ఇవి శరీరాన్ని రోగనిరోధకంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
1. మధుమేహ నియంత్రణలో సహాయం
కరివేపాకులో ఉండే సహజ రసాయనాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. ఇది శరీరంలోని ఇన్సులిన్ క్రియాశీలతను మెరుగుపరచి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉదయం ఖాళీ కడుపుతో 2–4 కరివేపాకు ఆకులు నమలితే మధుమేహ నియంత్రణకు మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
2. కాలేయాన్ని శుభ్రపరచే సహజ ఔషధం
కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు, డీటాక్సిఫైయింగ్ గుణాలు ఉండటంతో లివర్‌ను విషపూరిత పదార్థాల నుండి కాపాడటంలో ఇది సహాయపడుతుంది.
3. జుట్టు సమస్యలపై పరిష్కారం
కొబ్బరి నూనెలో కరివేపాకు మరిగించి తలకందించడం వల్ల జుట్టు రాలడం, నెరసిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది జుట్టు మూలాలను బలపరచి, జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది.
4. జీర్ణవ్యవస్థకు మేలు
జీర్ణక్రియ సమస్యలున్నవారికి కరివేపాకు ఉపయోగించవచ్చు. ఇది గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
5. కంటి ఆరోగ్యానికి పునాదిగా
కరివేపాకులో విటమిన్ A సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడం, కంటి రుగ్మతల నివారణలో సహాయపడుతుంది. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల ప్రకారం, కరివేపాకు కంటి ఆరోగ్యాన్ని కాపాడే అతి ముఖ్యమైన ఔషధంగా పేర్కొనబడింది.