Viral Video : సిటీలలో చాలామంది ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేస్తుంటారు. తొందరగా వెళ్లాలనే కారణంతో.. కొందరు సిగ్నల్స్ దగ్గర కూడా ఆగకుండా వెళ్లడం.. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించడం.. రాంగ్ రూట్ నుంచి రావడం, సందుల్లో బొందుల్లో వెళ్లడం, ఏమాత్రం ట్రాఫిక్ సెన్స్ లేకుండా రోడ్డు మీద వాహనాలను నడపడం మనం చూస్తూనే ఉంటాం. అయితే.. ప్రస్తుతం రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు లేకున్నా.. రోడ్డు మీద ఉండే సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ట్రాఫిక్ ను గమనిస్తున్నారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించినట్టు తెలిస్తే.. ఆన్ లైన్ లోనే వెంటనే చలానా విధిస్తున్నారు. కేవలం బండి నెంబర్ ఉంటే చాలు.. వాళ్లు ఎక్కడున్నా కూడా ఎక్కడ రూల్స్ బ్రేక్ చేసినా.. వెంటనే ఆన్ లైన్ లో చలానా వచ్చే విధంగా టెక్నాలజీని డెవలప్ చేశారు.
అయినప్పటికీ.. కొందరు అత్యుత్సాహంతో సీసీకెమెరాల కంట పడకుండా ఉండేందుకు పలు రకాల ప్లాన్స్ వేస్తున్నారు హైదరాబాద్ లో. చలానా నుంచి తప్పించుకోవడం కోసం.. పోలీస్ కనిపిస్తేనే హెల్మెట్ పెట్టుకోవడం, నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేయడం, సీసీకెమెరాల కంట పడకుండా.. రాంగ్ రూట్ లో వెళ్లడం, సైడ్ నుంచి వెళ్లడం.. లాంటివి చేసి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు.
ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎలాగోలా తప్పించుకోవచ్చు కానీ.. ప్రమాదాల నుంచి తప్పించుకోలేరు కదా. ట్రాఫిక్ పోలీసుల కంట పడకుండా ఉండేందుకు రకరకాలుగా ప్రయత్నించి.. చివరకు రోడ్డు ప్రమాదాలకు గురయ్యేవాళ్లు చాలామంది ఉన్నారని.. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదని.. వాహనదారులకు అవగాహన తీసుకొచ్చేందుకు ఒక ఫన్నీ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూపొందించారు. దాన్ని తమ యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కెమెరాల నుంచి తప్పించుకుంటున్నాం అనుకోకండి.. ప్రమాదాలకు దగ్గరవుతున్నారని గ్రహించండి.. అంటూ ట్రాఫిక్ పోలీసులు పోస్ట్ చేసిన ఆ వీడియోకు మంచి స్పందన వస్తోంది. మీరు కూడా ఆ వీడియో చూడండి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.