7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరోసారి పెరగనున్న డీఏ.. ఎంతో తెలుసా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరోసారి గుడ్ న్యూస్ చెప్పనుంది. మరోసారి డీఏ పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనవరిలో పెరగాల్సిన డీఏ.. ఇటీవల పెంచారు. కేంద్రం డీఏను 42 శాతం చేసింది. ఇదివరకు 38 శాతం ఉండగా.. దాన్ని 42 శాతం చేసింది. 4 శాతం పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఒక్కసారిగా పెరిగాయి.
da to hike in july as part of 7th pay commission
పెరిగిన డీఏ ఈ నెల నుంచి అమలులోకి రానుండగా జనవరి నుంచి పెరిగిన డీఏ బకాయిలను కేంద్రం.. ఉద్యోగులకు చెల్లించనుంది. అయితే.. మరోసారి డీఏను పెంచే అవకాశం ఉన్నట్టు ప్రస్తుతం తెలుస్తోంది. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్రం.. డీఏను పెంచుతుంది. ఇప్పటికే 4 శాతం పెంచింది. కానీ.. అది జనవరికి సంబంధించిన పెంపు. ఖచ్చితంగా సంవత్సరానికి రెండు సార్లు డీఏ పెరుగుతుంది. జనవరి, జులైలో డీఏను రివైజ్ చేస్తుంటారు. తాజాగా రివైజ్ చేసింది జనవరికి సంబంధించింది.
7th Pay Commission salary hike announcement for central govt employees
7th Pay Commission : జులైలో మళ్లీ పెరగనున్న డీఏ
అయితే.. జులైలో మళ్లీ డీఏ పెరగనుందట. అప్పుడు 42 శాతం నుంచి మరో 4 శాతం పెరిగి 46 శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల పెరిగిన 4 శాతం డీఏతో 50 లక్షల కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని డీఏను ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్రం పెంచుతూ ఉంటుంది. తాజాగా ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు 4 శాతం పెంచింది. మళ్లీ జులై నెలలో మరో 4 శాతం పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. దాని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.
