Viral News : మా తండ్రే మమ్మల్ని అత్యాచారం చేశాడు.. సీఎంకు కూతుళ్ల లేఖ!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 6 August 2022, 6:30 am

Viral News : సమాజంలో ఆడివారిపై అఘాయిత్యాలు పెరుగుతున్న తరుణంలో మానవ మృగాళ్ల నుంచి కన్నకూతుళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే వారి పాలిట కాలయముడయ్యాడు. రాత్రి అయ్యిందంటే చాలు అతనిలోకి మృగం నిద్రలేచి కన్నకూతుళ్లని చూడకుండా వారితో అసభ్యంగా ప్రవర్తించడం, ప్రతిఘటిస్తే అత్యాచారం చేయడం ఆ క్రూరుడికి పరిపాటిగా మారింది. బాధితులు ఈ విషయాన్ని తల్లితో చెబితే ఆమె కూడా పట్టించుకోకపోవడంతో అతని అఘాయిత్యాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని పారిశ్రామిక వాడలో ఆలస్యంగా వెలుగుచూసింది.

తండ్రి అకృత్యాలను ఏళ్లుగా భరిస్తూ వస్తున్న మైనర్ బాలిక ఇంట్లో వారు పట్టించుకోకపోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో వారు కేసు నమోదు చేసి నిందితుడిని కటకటలా వెనక్కి నెట్టారు. అయితే, కూతురి పట్ల భర్త ప్రవర్తిస్తున్న తీరును తప్పుపట్టాల్సిన తల్లి కూడా అతనికే వత్తాసు పలకడంతో ఆ కామాంధుడు రెచ్చిపోయాడు. ఇదిలాఉండగా కన్నతండ్రినే జైలుకు పంపి కుటుంబం పరువు తీస్తావా అంటూ కుటుంబీకులు బాధితురాలిని చంపేందుకు యత్నించడంతో బాధిత మైనర్ స్థానిక పోలీసులను శరణు కోరింది. తండ్రి చేతిలో అత్యాచారానికి గురైన బాలిక తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేయడంతో ఆమె అక్క కూడా దీనిపై స్పందించింది.

Viral News daughters letter to haryana cheif minister for father raped them

Viral News daughters letter to haryana cheif minister for father raped them

పదేళ్ల కిందట తన తండ్రి తనను కూడా లైంగికంగా వేధించాడని.. ఇప్పుడు తన చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. నిందితుడిని కఠినంగా శిక్షించి తన చెల్లికి, తనకు రక్షించాలని ఆ రాష్ట్ర సీఎంకు లేఖ రాసింది.తండ్రి పరువు కోసం అతను చేస్తున్న అకృత్యాలను ఇన్నిరోజులు ఓపికగా భరించిన తనకు.. ఇకమీదట తన చెల్లెలి జీవితం నాశనం కావడం ఇష్టం లేకే ఈ విధంగా లేఖ రాస్తున్నానని వివరించింది. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆడపిల్లల వీడియో, లేఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధితురాళ్లకు న్యాయం చేసి కన్నకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి