Rapaka Varaprasad : రాపాక వరప్రసాద్ మీద జగన్ చర్యలు..!
Rapaka Varaprasad : గెలిచింది జనసేన పార్టీ నుంచి. ఇప్పుడు మద్దతు ఇచ్చేది వైఎస్సార్సీపీకి. జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్కడు చివరకు ఆ పార్టీకే అన్యాయం చేశాడు. పార్టీ అధినేత రెండు చోట్ల పోటీ చేసినా ఓడిపోయారు కానీ.. రాపాక వరప్రసాద రావు మాత్రం జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టికెట్ ఇచ్చిన పార్టీకే ద్రోహం చేసి వైసీపీవైపు మొగ్గు చూపారు. అందుకే.. జనసేన నుంచి ఎలా బయటపడాలా అని పలు రకాలుగా ప్లాన్స్ వేసుకున్నారు. కావాలని జనసేన పార్టీపై విమర్శలు చేయడం, సీఎం జగన్ ను పొగడటం, సీఎం జగన్ సభలకు హాజరు అవడం లాంటివి చేశారు. ఇవన్నీ చేసి చివరకు వైసీపీ ఎమ్మెల్యే అయిపోయాడు రాపాక.
రాజోలు నియోజకవర్గం నుంచి గెలిచిన రాపాక అక్కడ ఉండే కాపు వర్గం ఓట్లను కోల్పోకుండా ఉండటం కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచే రాజోలులో రాపాక పోటీ చేయాలి కానీ.. జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో పవన్ కళ్యాణ్ చేరదీసి జనసేన నుంచి టికెట్ ఇచ్చారు. దీంతో 800 పైచిలుకు మెజారిటీతో రాపాక గెలిచారు. అయితే.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. వైసీపీలో ఉండి.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేశారని నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది. ఈ సమయంలో వైసీపీని కాపాడాలని.. టీడీపీ నుంచి తనకే ఆఫర్ వచ్చిందంటూ గప్పాలు కొట్టాడు రాపాక.
Rapaka Varaprasad : ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అయిన విషయం తెలిసిందే
ఆ తర్వాత కాదు.. తాను అలా అనలేదని అన్నారు. ఆ తర్వాత తెల్లారి అసలు తనకు దొంగ ఓట్లు పడటంతోనే గెలిచానని తేల్చి చెప్పారు రాపాక. ఇలా.. ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడి వైసీపీ పార్టీకి లేనిపోని చిక్కులు తీసుకొచ్చేలా ఉన్నారని అంటున్నారు. అంతే కాదు.. ఈ మధ్య పేకాట చాంపియన్ షిప్ ల పేరుతో తన ప్రత్యర్థులకు సవాళ్లు విసరడం రాపాకకు కామన్ అయిపోయింది. వీటన్నింటినీ గమనిస్తున్న జగన్.. చివరకు రాపాకపై చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారట. జనసేన నుంచి వైసీపీలోకి వచ్చిన రాపాకను వైసీపీ నుంచి జగన్ బహిష్కరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.