Ys Jagan – Chandrababu : జగన్ – చంద్రబాబు ల మధ్య తేడా స్పష్టంగా బయటపడిన సందర్భం..!
Ys Jagan – Chandrababu : ఏపీలో సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరూ ఉద్ధండులే. ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ ను పాలించిన వారే. ఒకరు ఉమ్మడి ఏపీని 9 ఏళ్లు, తెలంగాణ విడిపోయిన తర్వాత మరో 5 ఏళ్లు పాలించారు. ఇంకో నేత 2019 లో అధికారంలోకి వచ్చారు. గత నాలుగేళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఏపీని అభివృద్ధిలో ముందంజలో ఉంచారు. ఇద్దరూ ముఖ్యమంత్రులే అయినా కూడా అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీల అధినేతల మధ్య స్పష్టమైన తేడాను మనం గమనించవచ్చు. అవును.. ఇన్నేళ్ల ముఖ్యమంత్రి అనుభవం ఉన్న చంద్రబాబు ఏపీలో చేసిందేం లేదు. ఏపీ రాజకీయాల్లో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
చాలా ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ.. వెనక్కి తిరిగి చూస్తే అభివృద్ధి మాత్రం శూన్యం. కానీ.. అధికారం చేపట్టిన 4 ఏళ్లలోనే సీఎం జగన్ మాత్రం ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారు. పేరుకు 40 ఏళ్ల అనుభవం ఉంది అని అంటారు కానీ.. ఒక్కటంటే ఒక్కటి సరైన పథకాన్ని అమలు చేసింది లేదు. కానీ.. వేరే వాళ్లు తీసుకొచ్చిన పథకాలను కాపీ కొట్టడంలో మాత్రం నెంబర్ వన్. భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ ఇటీవల సభలో చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన మేనిఫెస్టో పైనే చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై విమర్శల వర్షం కురిపించిన చంద్రబాబు ఇప్పుడు చేసిందేంటి.
Ys Jagan – Chandrababu : భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ ఏం చేద్దామనుకుంటోంది?
అవే పథకాలను అటూ ఇటూగా మార్చి భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తీసుకొచ్చారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు పేర్లు మార్చి మహిళా సాధికారత, మహిళా సంక్షేమం అని చెప్పగానే జనాలు నమ్మేస్తారా? ఇవన్ని పథకాలు నిజంగా చంద్రబాబు ఆలోచనే అయితే 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎందుకు అమలు చేయలేదు. అసలు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే చంద్రబాబు అమలు చేయలేదు అంటూ టీడీపీ కార్యకర్తలే చంద్రబాబు మేనిఫెస్టోపై మండిపడుతున్నారంటే.. చంద్రబాబు ఎంత పెద్ద తప్పు చేశారో స్పష్టం అవుతూనే ఉంది. 4 ఏళ్లలోనే ఏపీలో ఇన్ని సంక్షేమ పథకాలను ప్రారంభించి దేశంలోనే ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన సీఎం జగన్ కు, చంద్రబాబుకు అసలు పోలికే లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.