Home » Exclusive » Different Triangle Married Love Story In Bihar
Exclusive

నా భార్యను లేపుకెళ్తావా? వాడి భార్యపై కన్నేసి ఏం చేశాడో తెలుసా?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: March 4, 2023, 12:20 pm
Advertisement

ఒక వ్యక్తి భార్యను మరో వ్యక్తి లేపుకెళ్లాడు. దీంతో నా భార్యను లేపుకెళ్తావా? అని తన భార్యను లేపుకెళ్లినోడి భార్యను ఇతడు లేపుకెళ్లాడు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. కాగాడియా జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. నీరజ్, రుబియా ఇద్దరూ భార్యాభర్తలు. వీళ్లది చౌదరి గ్రామం. వీళ్లకు నలుగురు కొడుకులు. అదే గ్రామానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తితో రుబియా.. తన భర్తకు తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకుంది. నిజానికి వాళ్లది అక్రమ సంబంధం కాదు. ఎందుకంటే.. ఇద్దరూ పెళ్లికి ముందే ప్రేమించుకున్నారు కానీ..

Advertisement

different triangle married love story in bihar

ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ వేర్వేరు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది.రుబియా వేరే పెళ్లి చేసుకున్నా కూడా.. ముఖేష్ తో రిలేషన్ షిప్ ను అలాగే కంటిన్యూ చేస్తోంది. ముఖేష్ ను విడిచి ఉండలేక తన కొడుకులను తీసుకొని ముఖేష్ తో రుబియా లేచిపోయింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. వెంటనే గ్రామ పెద్దలు ముఖేష్ కు కాల్ చేసి గ్రామానికి రావాలన్నారు. దీంతో ఒక్కడే వచ్చాడు. ముఖేష్, నీరజ్ ఇద్దరూ గొడవపడ్డారు. రుబియా ఇక నుంచి నా భార్య. నీతో రాదు. నాతోనే ఉంటుంది.. అంటూ ముఖేష్ చెప్పడంతో నీరజ్ కు ఏం చేయాలో అర్థం కాలేదు.

Advertisement

ముఖేష్ భార్యకు దగ్గరయిన నీరజ్

నా భార్యనే లేపుకెళ్తావా అని.. అదే గ్రామంలో ఉంటున్న ముఖేష్ భార్యకు దగ్గరయ్యాడు నీరజ్. తన నెంబర్ తీసుకొని అప్పుడప్పుడు ముఖేష్ వివరాలు అడిగేవాడు. ఆమె కూడా అప్పుడప్పుడు నీరజ్ కు ఫోన్ చేస్తుండేది. అలా.. ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. అది కాస్త ప్రేమగా మారింది. తనను దగ్గరుండి అన్నీ చూసుకునేవాడు. ఒకరోజు పెళ్లి చేసుకుంటా అని తనకు ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె కూడా ఒప్పుకుంది. గ్రామస్తుల సమక్షంలో తనకు పెళ్లి చేశారు. తన భార్యను లేపుకెళ్లిన ముఖేష్ కు సరైన గుణపాఠం చెప్పి వాడి పెళ్లాన్నే పెళ్లి చేసుకొని స్థానికంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు నీరజ్.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి