Village Cooking Channel : విలేజ్ కుకింగ్ ఛానెల్ యూట్యూబ్ ఛానెల్ వారు వాడే కెమెరా ధర అన్ని ల‌క్ష‌లా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Village Cooking Channel : విలేజ్ కుకింగ్ ఛానెల్ యూట్యూబ్ ఛానెల్ వారు వాడే కెమెరా ధర అన్ని ల‌క్ష‌లా..?

 Authored By ramu | The Telugu News | Updated on :10 July 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Village Cooking Channel : విలేజ్ కుకింగ్ ఛానెల్ యూట్యూబ్ ఛానెల్ వారు వాడే కెమెరా ధర అన్ని ల‌క్ష‌లా..?

Village Cooking Channel : విలేజ్ కుకింగ్ ఛానెల్ యూట్యూబ్ ఫాలోవ‌ర్స్‌కి చాలా సుప‌రిచితం. ఇందులో వెరైటీ వంట‌కాలు చేసి చూపిస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్నారు. మొదటి డైమండ్ క్రియేటర్ అవార్డును అందుకున్న మొదటి తమిళ యూట్యూబ్ ఛానెల్‌గా నిలిచింది. వంటలపై వీరు చేసిన వీడియోలు 100 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును సాధించాయి. ఇక ఇందులో త‌మిళ‌నాడు ప్రాంతానికి చెందిన ఎం.పెరియతంబి కూడా ఓ భాగం. పెరియతంబికి ఒక్క భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు.

Village Cooking Channel కాస్ట్ లీ కెమెరా..

తాను చేసిన వంటలు తన కోసం కాకుండా అనాథలైన చిన్నపిల్లలకు వడ్డించేవారు. ఇటీవ‌ల ఈ ఛాన‌ల్‌ను కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కూడా విజిట్ చేసి వారితో కలిసి భోజనం చేశారు. దీని త‌ర్వాత త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ విక్ర‌మ్ సినిమాలో ఈ తాత‌తో ఏకంగా ఇంట‌ర్వెల్ ఏపిసోడ్ ప్లాన్ చేసి విజ‌యం సాధించాడు. ఇటీవ‌ల హార్ట్ డిసీజ్ కారణంగా ఆ తాత హాస్పిటల్‌లో చేరాడు. ఇప్పుడు కోలుకున్నాడు. అయితే ఈ ఛానెల్ వారు వినియోగిస్తున్న కెమెరా ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. ప్రతి వీడియో కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉండేందుకు విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ వారు 8కే రిజల్యూషన్ కలిగిన రెడ్ రాప్టర్ కెమెరాను వినియోగిస్తున్నారు.

Village Cooking Channel విలేజ్ కుకింగ్ ఛానెల్ యూట్యూబ్ ఛానెల్ వారు వాడే కెమెరా ధర అన్ని ల‌క్ష‌లా

Village Cooking Channel : విలేజ్ కుకింగ్ ఛానెల్ యూట్యూబ్ ఛానెల్ వారు వాడే కెమెరా ధర అన్ని ల‌క్ష‌లా..?

దీని ధర దాదాపు రూ. 40 లక్షలుగా ఉంది. సినిమా షూట్ చేసేందుకు వాడే కెమెరాను ఈ యూట్యూబ్ ఛానల్ వారు యూజ్ చేస్తున్నారు. రాప్టర్ 8కే అనేది అత్యంత శక్తివంతమైన, అధునాతనమైన సినిమా కెమెరా. 8కే లార్జ్ ఫార్మాట్ లేదా 6కే ఎస్35 షూట్ చేయగల అద్భుతమైన మల్టీ-ఫార్మాట్ 8కే సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతో వీడియో క్వాలిటీ సినిమా రేంజ్ లో ఉంటుడ‌డం మ‌నం చూశాం. అయితే సాధార‌ణంగా వీడియో క్వాలిటీ బాగుంటేనే వ్యూస్ ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబ‌ట్టి యూట్యూబర్లు, వ్లాగర్స్ హై క్వాలిటీ కెమెరాలను వినియోగిస్తుంటారు. విలేజ్ కుకింగ్ ఛానెల్ వారు అందుకే అంత కాస్ట్‌లీ కెమెరాని ఉప‌యోగిస్తున్నారు. ఇక ఈ వీడియోస్ షూట్ చేసే వారు 22 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్నారు. దీంతో వారికి ల‌క్ష‌ల రూపాయ‌ల ఆదాయం వ‌స్తుంది

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది