Village Cooking Channel : విలేజ్ కుకింగ్ ఛానెల్ యూట్యూబ్ ఫాలోవర్స్‌కి చాలా సుపరిచితం. ఇందులో వెరైటీ వంటకాలు చేసి చూపిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. మొదటి డైమండ్ క్రియేటర్ అవార్డును అందుకున్న మొదటి తమిళ యూట్యూబ్ ఛానెల్‌గా నిలిచింది. వంటలపై వీరు చేసిన వీడియోలు 100 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును సాధించాయి. ఇక ఇందులో తమిళనాడు ప్రాంతానికి చెందిన ఎం.పెరియతంబి కూడా ఓ భాగం. పెరియతంబికి ఒక్క భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు.
తాను చేసిన వంటలు తన కోసం కాకుండా అనాథలైన చిన్నపిల్లలకు వడ్డించేవారు. ఇటీవల ఈ ఛానల్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా విజిట్ చేసి వారితో కలిసి భోజనం చేశారు. దీని తర్వాత తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాలో ఈ తాతతో ఏకంగా ఇంటర్వెల్ ఏపిసోడ్ ప్లాన్ చేసి విజయం సాధించాడు. ఇటీవల హార్ట్ డిసీజ్ కారణంగా ఆ తాత హాస్పిటల్‌లో చేరాడు. ఇప్పుడు కోలుకున్నాడు. అయితే ఈ ఛానెల్ వారు వినియోగిస్తున్న కెమెరా ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ప్రతి వీడియో కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉండేందుకు విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ వారు 8కే రిజల్యూషన్ కలిగిన రెడ్ రాప్టర్ కెమెరాను వినియోగిస్తున్నారు.
దీని ధర దాదాపు రూ. 40 లక్షలుగా ఉంది. సినిమా షూట్ చేసేందుకు వాడే కెమెరాను ఈ యూట్యూబ్ ఛానల్ వారు యూజ్ చేస్తున్నారు. రాప్టర్ 8కే అనేది అత్యంత శక్తివంతమైన, అధునాతనమైన సినిమా కెమెరా. 8కే లార్జ్ ఫార్మాట్ లేదా 6కే ఎస్35 షూట్ చేయగల అద్భుతమైన మల్టీ-ఫార్మాట్ 8కే సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతో వీడియో క్వాలిటీ సినిమా రేంజ్ లో ఉంటుడడం మనం చూశాం. అయితే సాధారణంగా వీడియో క్వాలిటీ బాగుంటేనే వ్యూస్ ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి యూట్యూబర్లు, వ్లాగర్స్ హై క్వాలిటీ కెమెరాలను వినియోగిస్తుంటారు. విలేజ్ కుకింగ్ ఛానెల్ వారు అందుకే అంత కాస్ట్‌లీ కెమెరాని ఉపయోగిస్తున్నారు. ఇక ఈ వీడియోస్ షూట్ చేసే వారు 22 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్నారు. దీంతో వారికి లక్షల రూపాయల ఆదాయం వస్తుంది
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.