Senior NTR Assets : సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి సపోర్ట్ లేకున్నా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. తెలుగు రాజకీయాల రూపురేఖలనే మార్చేశారు.అయితే.. ఇప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ గురించి ఓ టాపిక్ చర్చలో ఉంటుంది. అదే ఆయన ఆస్తుల గురించి. అసలు..సినిమాల్లో నటించేసమయంలో..
రాజకీయాల్లోకి వచ్చాక సీనియర్ ఎన్టీఆర్ ఎన్ని ఆస్తులు సంపాదించారు. ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి.. అని అందరూ తెగ ఆలోచిస్తుంటారు.అయితే.. సీనియర్ ఎన్టీఆర్ కు ఇప్పటికీ ఉన్న ఆస్తులు ఏవో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆయన తన జీవిత కాలంలో ఎన్ని ఆస్తులు కూడబెట్టారో తెలిస్తే కూడా ఆశ్చర్యపోతారు.సీనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన తర్వాతే ఆస్తులు కూడబెట్టడం మొదలు పెట్టారు.
తొలిసారి హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఎస్టేట్ కొన్నారు. ఆ తర్వాత అబిడ్స్ లోని రామకృష్ణ థియేటర్ ను కట్టించారు. ఆ తర్వాత థియేటర్ పక్కనే ఉన్న బార్ లోనూ కొన్ని డబ్బులు పెట్టారు.ఇప్పటికీ ఆ రామకృష్ణ థియేటర్, పక్కనే ఉన్న బార్ సీనియర్ ఎన్టీఆర్ పేరు మీదే ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని స్థలాలు కూడా కొన్నారు. కాచిగూడలో తారకరామా థియేటర్ నిర్మించారు.ఆ తర్వాత మాసబ్ ట్యాంక్ లో కొన్ని బిల్డింగ్ లు నిర్మించారు. ఆయా భవనాల్లో ఇప్పుడు తన కొడుకులు ఉంటున్నారు.
సీనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా.. బిల్డింగులు, థియేటర్లనే కట్టించారు.బంజారాహిల్స్ లో ముచ్చటపడి కట్టించుకున్న బిల్డింగ్ లోనే ఎన్టీఆర్ చాలా ఏళ్లపాటు ఉన్నారు. తన చివరి దశలో కూడా అక్కడే ఉన్నారు. ఆ ఇంటిని లక్ష్మీపార్వతికి రాసిచ్చారు.నాచారంలో హార్టికల్చర్ ఫిలిం స్టూడియోను నిర్మించారు. ఆయన హైదరాబాద్ కు రాకముందు.. చెన్నైలలోనూ కోట్లాస్తి సంపాదించారు. ఇప్పటికీ చెన్నైలోని ఆస్తులన్నీ సీనియర్ ఎన్టీఆర్ పేరు మీదనే ఉన్నాయి. అయితే.. తాను సంపాదించిన ఆస్తులన్నింటినీ.. తన కొడుకులు, కూతుళ్లకు సమానంగా పంచి ఇచ్చారు ఎన్టీఆర్.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.