cant imagine a movie song without sirivennela sitaramashastri
Sirivennela : ఎన్నో హిట్ పాటలను అందించిన తెలుగు సినిమా సినీ గేయ రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రి నిన్న కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి అనేక మంది తెలుగు స్టార్ హీరోలు మరియు అనేక మంది దర్శకులు, ఆర్టిస్టులు నివాళులు అర్పించారు. ఇక ఆయనకు నివాళి అర్పించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు మాట్లాడుతూ సిరి వెన్నెల గారిని కోల్పోవడం చాలా బాధాకరమని ఇది తెలుగు సినీ ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు.
మ్యూజిక్ కు సీతారామ శాస్త్రి గారు ఎంతో చేశారని మహేశ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా తెలుగు సినీ పరిశ్రమ అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు. కాగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి దాదాపు 3000 లకు పైచిలుకు తెలుగు పాటలకు సాహిత్యం అందించారు.
cant imagine a movie song without sirivennela sitaramashastri
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరికీ ఆయన పాటలు రాశారు. అసలు సినిమానే ఆయన తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఆయన పాటలు రాసిన సిరివెన్నెల సినిమా పేరునే తన పేరుకు ముందు పెట్టుకున్నారు. చాలా మంది సినీ తారలు ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని తెలిపారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సిరి వెన్నెల ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ కన్నుమూశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సొంతూరు ఆంధ్రప్రదేశ్ లో ని అనకాపల్లి. ఆయన 1955లో జన్మించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆయన తన పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్డమ్' kingdom movie . గౌతమ్…
Copper Water Bottles : కాపర్ బాటిల్ వాడేటప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నిమ్మకాయ నీరు, జ్యూస్ లేదా…
Coolie Movie : సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై…
Oriental Jobs : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…
Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
This website uses cookies.