Bathroom Towel : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి జీవనశైలి మరియు మనం తీసుకునే ఆహారం చాలా బాగుండాలి అని మన అందరికీ తెలుసు. అయితే బాత్రూం విషయంలో మనం తెలిసో తెలియకో కొన్ని తప్పులను చేస్తూ ఉంటాం. అప్పుడు అవి కొన్ని సమస్యలను తెచ్చి పెడుతుంది. దీంతో మన ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిజానికి ఇవి పెద్ద తప్పులు అనిపించక పోయినప్పటికీ వాటి వలన జరిగే నష్టం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అని నిపుణులు అంటున్నారు. ఇంతకీ బాత్రూమ్ విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో మనం తెలుసుకుందాం…. ప్రస్తుత కాలంలో చాలా మంది బాత్ రూమ్ లోకి కూడా స్మార్ట్ ఫోన్ ను తీసుకెళ్తూ ఉన్నారు. దీని వలన అవసరం లేకపోయినా గంటల తరబడి బాత్ రూమ్ లో కూర్చొని ఉంటారు. అయితే ఎక్కువ టైం టాయిలెట్ లో ఉంటే బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి అని నిపుణులు అంటున్నారు.
అంతేకాక ఫోన్ పై చేరే బ్యాక్టీరియా కారణంగా ఆరోగ్యం పై కూడా ఎంతో ప్రభావం పడుతుంది. అయితే జర్నల్ అన్నల్స్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ యాంటీ మైక్రో బయాలజీలో ప్రచురించబడిన నివేదిక ప్రకారం చూస్తే, 95% ఇన్ఫెక్షన్లకు కారణం అయ్యే బ్యాక్టీరియా సాల్మో నేల్ల, ఈ కోలి సి మరియు డిఫిసిల్ లాంటివి బాత్ రూమ్ లో ఎక్కువగా ఉంటాయి. ఇక మనలో ఎంతోమంది బ్రష్ చేసిన తర్వాత కూడా బ్రష్ ను బాత్ రూమ్ లోనే పెడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా టాయిలెట్ సీట్ కు సమీపంలో పెట్టడం వలన చాలా అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా బ్రష్ పై పేరుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
ఇక మనలో ఎంతోమంది చేసే మరో ప్రధాన సమస్య ఏమిటి అంటే. వేస్ట్రన్ టాయిలెట్ పైన ఉండే మూత ను తెరిచి ఉండడం. దీని వలన బాత్ రూమ్ లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని నిపుణులు అంటున్నారు… అయితే బాత్ రూమ్ లోకి వెళ్లే టైంలో కచ్చితంగా చెప్పులు ధరించాలి అనే నిపుణులు అంటున్నారు. లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మరియు అరికాళ్ళపై మొటిమలు మరియు స్టెఫీలో కాక్ ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మనలో ఎంతోమంది చేసే తప్పులలో మరొకటి టవల్ ను వలన బాత్ రూమ్ లోపల ఉంచడం. ఇలా చేయడం వలన టవల్ పై తొందరగా బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. ముఖ్యంగా శిలీంద్రాలు లాంటి సూక్ష్మ జీవులు కూడా పెరుగుతాయి. ఇలాంటి టవల్ ను వాడడం వలన శరీరంపై దురద,ఇన్ఫెక్షన్ లాంటి చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. కావున టవల్ ను బాత్రూంలో ఉంచటం మంచిది కాదు. అలాగే కనీసం ఒక రెండు రోజులకు ఒకసారి టవల్ ను క్లీన్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.