Dolo 650 Tablets : వామ్మో.. సోషల్ మీడియాలో ‘డోలో’ మీమ్స్ మామూలుగా లేవు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dolo 650 Tablets : వామ్మో.. సోషల్ మీడియాలో ‘డోలో’ మీమ్స్ మామూలుగా లేవు..

 Authored By mallesh | The Telugu News | Updated on :26 January 2022,7:00 am

Dolo 650 Tablets : కరోనా మహమ్మారి పుణ్యమాని డోలో 650 సూపర్ మెడిసిన్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడా చూసినా ప్రతీ ఒక్కరు బోలో ‘డోలో’ అని అంటున్నారు. జ్వరం, కాస్త దగ్గు, ఒళ్లు నొప్పులు, ఇతరాలు ఏవి ఉన్నా వెంటనే డోలో ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే అని చెప్తున్నారు. అలా ప్రతీ ఇంటిలో ఒక నిత్యావసర సరుకుగా మారిపోయింది డోలో 650 ట్యాబ్లెట్. ఇకపోతే ప్రస్తుతం ఒమిక్రాన్, డెల్ట్రాకాన్ వేరియంట్స్ కొవిడ్ కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ట్యాబెట్ల్ యూసేజ్ ఇంకా బాగా పెరిగింది.ఈ డోలో 650 ట్యాబ్లెట్ ప్రతీ ఒక్కరి ఇంట్లో కచ్చితంగా ఉండే మాత్రని చెప్పొచ్చు.

ఇకపోతే ఈ కరోనా కాలంలో సోషల్ మీడియాలో డోలోపైన ఇటీవల కాలంలో బోలెడన్ని మీమ్స్ వచ్చాయి. ట్విట్టర్ , ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ .. వంటి సామాజిక మాధ్యమాలన్నిటిలోనూ డోలో ట్యాబ్లెట్ కు సంబంధించిన వీడియోలను బాగా వైరలవ్ చేస్తున్నారు. డోలో ట్యాబ్లెట్ ను చాలా మంది ఓ గొప్ప ఔషధంగా భావిస్తున్నారు. కానీ, ఇది అత్యంత సాధారమైన మందు మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.ఈ క్రమంలోనే మీమర్స్ ‘డోలో 650’ ప్రాముఖ్యత తెలిపేందుకుగాను రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు కూడా. కొవిడ్ భయానక పరిస్థితులు ఇలానే కొనసాగితే..

dolo 650 tablets memes viral in social media

dolo 650 tablets memes viral in social media

Dolo 650 Tablets : సర్వరోగ నివారిణిగా డోలో..!

కనుక మరి కొన్ని రోజుల్లో డోలో 650 ట్యాబ్లెట్స్‌ను మార్కెట్‌లోకి కేజీకి ఇన్ని రూపాయలు అనే విధంగా అమ్ముతారని మీమ్ క్రియేట్ చేశారు. ఒకప్పుడు జనాలు పోలో తినేవారని, ఇప్పుడు అందరూ డోలో తింటున్నారని చెప్తున్నట్లుగానూ మీమ్ క్రియేట్ చేశారు. సర్వరోగ నివారణి డోలో అని తెలిపే విధంగా ఓ చిత్రం రూపొందించి వైరల్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘శివాజీ’ సినిమాలోని వీడియోను రీ క్రియేట్ చేశారు. అందులో రజనీకాంత్ డోలోను స్టైల్ గా నోట్లో వేసుకుంటున్నట్లు చూపిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది