Farmers : రైతన్నలకు శుభవార్త… ఈ పంట సాగు పై సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం…!

 Authored By ramu | The Telugu News | Updated on :2 July 2024,3:00 pm

Farmers : ప్రతి దేశానికి ఎంతగానో వెన్నుముకగా నిలుస్తున్న రైతుల అందరికీ కూడా ఆర్థిక భరోసా ఇస్తూ పలు పథకాలను అమలు చేస్తున్నారు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. రైతులందరికీ కూడా అండగా నిలుస్తూ ఎంతో సాయం చేస్తున్నారు. దీనిలో భాగంగా సన్నకారు రైతులు అందరికీ కూడా రాయితీ ఇస్తుంది సర్కార్. ప్రస్తుతం ఎంతో ఆదరణ పొందుతున్న డ్రాగన్ పంట ను సాగు చేసే రైతులకు సర్కార్ అండగా నిలుస్తుంది. దీనిని సాగు చేసేందుకు అవసరమైన ఖర్చులన్నింటినీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఇలా రాయితిపై పంట సాగు చేయడానికి అర ఎకరం పైన మరియు 5 ఎకరాల కన్నా తక్కువగా ఉండేవారు మాత్రమే అర్హులు…

డ్రాగన్ పంట చెయ్యాలి అనే ఆసక్తిగల రైతులు జాబ్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో దగ్గరలోని ఉపాధి కార్యాలయ అధికారులు సందర్శించినట్లయితే వాటి గురించి అన్ని వివరాలను మీకు తెలియజేస్తారు. అయితే ఒక్క రేషన్ కార్డు కి ఒక్కరు మాత్రమే అర్హులు. అయితే పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా మీ పత్రాలను కార్యాలయంలో అందజేస్తే అర్హులు అయిన వారిని ఎంపిక చేస్తారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో ని రైతులు డ్రాగన్ పంటను సాగు చేసేందుకు ఎంతో మక్కువ చూపిస్తున్నారు. దీనిని జన్యుపరంగా చూస్తే,ఈ మొక్క ఎంతో మంచి పోషకాలు కలిగిన మొక్క అని చెప్పొచ్చు. దీనిని మెట్ట భూమి లో కూడా సులువుగా సాగు చేయొచ్చు. ఈ పంటను సాగు చేసేందుకు నీరు కూడా పెద్దగా అవసరం ఉండదు. అయితే మార్కెట్లో ఈ పండు ధర వచ్చి రూ.100 నుండి రూ.150 మధ్య ఉంటుంది…

Farmers : రైతన్నలకు శుభవార్త... ఈ పంట సాగు పై సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం...!

Farmers : రైతన్నలకు శుభవార్త… ఈ పంట సాగు పై సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం…!

ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి రెండు రకాలు. ఒకటి తెలుపు రంగు కలిగి ఉంటుంది. మరొకటి గులాబి రంగు కలిగి ఉంటుంది. ఈ తెలుపు రంగులో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ అనేది రుచిలో పుల్లగా ఉంటుంది. మరీ ఈ గులాబీ రంగులో ఉన్న పండు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు గుణాలను కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవటం వలన క్యాన్సర్ మరియు ఇతర రకాల వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది అని వైద్య నిపుణులు అంటున్నారు. దీనిలో ఎన్నో రకాల విటమిన్లు, కాల్షియం, ఐరన్,మెగ్నీషియం, ఫైబర్ ఇతర మేలు చేసే ఎన్నో గుణాలు దీనిలో ఉన్నాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పంట సాగుకు NREGS ద్వారా సన్న మరియు చిన్న కారు రైతులకు సబ్సిడీ కూడా ఇస్తున్నారు.ఈ పంటకు ఎంతో అవసరమైన సలహాలు,సూచనలు, సబ్సిడీలు అందించి రైతుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నారు సంబంధిత అధికారులు…

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి