Atchannaidu – YS Jagan : అచ్చన్నాయుడు మీద ఆడ పులిని దింపిన జగన్ – ప్లానింగ్ అద్దిరింది గురూ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Atchannaidu – YS Jagan : అచ్చన్నాయుడు మీద ఆడ పులిని దింపిన జగన్ – ప్లానింగ్ అద్దిరింది గురూ !

 Authored By kranthi | The Telugu News | Updated on :28 May 2023,9:00 am

Atchannaidu – YS Jagan : ఏపీలో టీడీపీ గెలవడం, ఓడటం అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడిని మాత్రం ఓడించాలనేది ఏపీ సీఎం జగన్ పంతం. అవును.. ఎందుకంటే వైఎస్సార్సీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు బాగానే రెచ్చిపోయారు. అందుకే ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవాలి కదా. 2019 లో తాము ఓడిపోతామని అచ్చెన్నాయుడు కల కూడా కని ఉండరు. 2019 ఎన్నికల్లో అంత జగన్ హవాలో కూడా శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు గెలిచారు.

duvvada vani versus Atchannaidu in tdp

duvvada vani versus Atchannaidu in tdp

అందుకే ఈసారి 2024లో ఎలాగైనా అచ్చెన్నాయుడును ఓడించాలని సీఎం జగన్ ప్లాన్ వేస్తున్నారు. మరోవైపు ఏపీకి టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్న విషయం తెలిసిందే. అందుకే.. ఆయన్ను ఓడించడానికి.. దువ్వాడ శ్రీనును బరిలో దించాలని సీఎం జగన్ ముందు భావించారు. దువ్వాడ శీనును బరిలోకి దించాలని గత నాలుగేళ్లుగా ఆయన్నే వైసీపీకి ఇన్ చార్జ్ గా నియమించారు జగన్. చివరకు ఎమ్మెల్సీని కూడా చేశారు కానీ..

అచ్చెన్నతో ఆడపులి సమరం

Atchannaidu : ఇప్పుడు దవ్వాడ వాణి వైపు మొగ్గు చూపుతున్న జగన్

సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకత వచ్చింది. వర్గ పోరు మొదలైంది. ఇది ఎక్కడ అచ్చెన్నాయుడు గెలుపునకు దారి తీస్తుందో అని భయపడ్డ జగన్ ఏకంగా ఆయన భార్య దువ్వాడ వాణిని పోటీలోకి దించారు. ఇప్పుడు ఆమె జెడ్పీటీసీగా ఉన్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలోనూ ఆమె పలు కార్యక్రమాల్లో హుషారుగా ఉంటున్నారు. ఆమె అయితేనే అచ్చెన్నను ఓడించగలరని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె కూడా సమరానికి సై అన్నట్టుగా ఉన్నారు. అందులోనూ టెక్కలిలో ఎక్కువగా కాళింగ సామాజికవర్గం ఉంది. అందుకే ఆమె వైపే జగన్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరి.. దువ్వాడ వాణి.. అచ్చెన్నాయుడిని ఓడిస్తారా లేదా తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది