ECI : కొత్త ఓటర్లకు భారత ఎన్నికల సంఘం గుడ్ న్యూస్.. ఏంటంటే?
ECI : జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా భారత ఎన్నికల సంఘం గతేడాది ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లునమోదు చేసుకన్న ఓటర్లకు శుభవార్త చెప్పింది. ఓటరు జాబితాలో పేరు రిజిస్టర్ చేసుకున్న ఓటర్లకు ఈపీఐసీ (ఎలక్టర్ ఫొటో ఐడెంటిటీ కార్డు)లను పోస్టు ద్వారా పంపాలని డిసైడ్ చేసినట్లు భారత ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ సేవలను ఈ రోజు నుంచి అనగా జనవరి 25 నుంచి స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పారు.ఓటరు కార్డులను ఇక నుంచి నేరుగా ఓటరు ఇంటికే పంపుతున్నట్లు భారత ఎన్నికల సంఘం అధికారి చెప్పారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ సేవలను స్టార్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నూతన ఓటర్లకు ఈపీఐసీ గుర్తింపు కార్డుతో పాటు ఒక ప్యాకెట్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.
అందులో ఈవీఎం, ఓటింగ్ విధానం గురించిన సమాచారం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇకపోతే భారత ఎన్నికల సంఘం పోర్టల్ ద్వారా కూడా ఓటర్ ఐడీ కార్డు డౌన్ లోడ్ చేసుకునే చాన్స్ ఉంటుంది.ఇకపోతే భారత ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్లు ఎన్నికల విధానంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పోలింగ్ బూత్‌లు, ఏజెంట్స్, ఓటర్లకు కల్పించే ఫెసిలిటీస్ పైన ఫోకస్ చేస్తోంది. భారత ఎన్నికల సంఘాన్ని 25 జనవరి 1950న స్థాపించిన సంగతి అందరికీ దాదాపుగా విదితమే.భారతదేశంలో ప్రతీ సంవత్సరం ఎన్నికల సంఘం స్థాపన రోజున జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటాం.
ECI : నేరుగా ఇంటికే..
ఈ రోజున ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పించేందుకు 18 ఏళ్లు నిండిన యువకులకు గుర్తింపు కార్డులను అందజేసి ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తారు. ఈ ఏడాది ఓటర్ల దినోత్సవం థీమ్..‘సాధికారత, జాగరూకత, రక్షణ’. ఈ ఏడాది భారతదేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో భారత్ లోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కూడా ఉంది.