EPFO decision on interest
EPFO : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) రూ. 15 వేలు అంతకంటే ఎక్కువ వేతనం ఉన్న సంఘటిత కార్మికుల కోసం కొత్త పెన్షన్ స్కీమ్‌ను అమలులోకి తీసుకురావాలని యోచిస్తోంది.. ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ఇంకా ఎక్కువ పెన్షన్ పొందేలా రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ కొత్త పెన్షన్ స్కీమ్‌ను తీసుకురావాలని భావిస్తోంది. పెన్షన్ స్కీమ్ 1995 (ఈపీఎస్95) పరిధిలోకి రాని ఫార్మల్ సెక్టార్ ఉద్యోగుల కోసం ఇది అందుబాటులో ఉంటుంది. సర్వీసులో చేరే సమయంలో నెలకు రూ. 15 వేల వరకు బేసిక్ శాలరీ (బేసిక్ శాలరీ+డియర్‌నెస్ అలవెన్స్) ఉన్న ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఈపీఎస్95 కింద పెన్షన్ స్కీము లాభాలను పొందుతారు.ఈపీఎస్-95 కింద పించన్ జమలకు రూ. 15 వేల వరకు మూలవేతనాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. దీని వల్ల రూ. 15 వేల కంటే ఎక్కువ జీతాన్ని తీసుకుంటున్నవారు ఈపీఎస్-95లోకి పరిధిలోకి వచ్చినా..
పెన్షన్ తక్కువ జమ(8.33 శాతం) అవుతుంది. అందుకే కొత్త పెన్షన్ స్కీంను అమలులోకి తీసుకొచ్చేందుకు పరిశీలనలో ఉంచారు. రూ. 15 వేల కంటే ఎక్కువ మూలవేతనం ఉన్నవారికి కూడా లాభదాయకంగా ఉండేలా మార్పులు చేసేందుకు ఈపీఎఫ్ఓ కసరత్తులు చేస్తోంది. వచ్చే నెల 11,12 తేదీల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.”ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)కు ఎక్కువ మొత్తం చెల్లించే వారికి ఎక్కువ పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. అందువల్ల, నెలవారీ బేసిక్ శాలరీ రూ.15 వేలు, అంతకంటే ఎక్కువ ఉన్న వారి కోసం కొత్త పెన్షన్ ప్రొడక్టు లేదా స్కీమ్ తీసుకురావాలనే ప్రపోజల్ పరిశీలనలో ఉంది.
epfo givs good news to employees
ప్రస్తుతం చాలా మంది రూ.15 వేల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నా, పెన్షన్ తక్కువగానే ఉంటోంది. ఎందుకంటే పెన్షనబుల్ బేసిక్ శాలరీ రూ.15 వేలకే పరిమితం” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆఫీసర్ ఒకరు వెల్లడించారు. వచ్చే నెల 11, 12 తేదీల్లో గౌహతిలో జరిగే ఈపీఎఫ్ఓ అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ కొత్త పెన్షన్ స్కీముపై చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1952 కింద కవరేజీ కోసం శాలరీ పరిమితిని నెలకు రూ. 15వేల నుండి నెలకు రూ. 25వేలకి పెంచే ప్రతిపాదనను ఉద్యోగుల ఈపీఎఫ్ఓ సమర్పించినా, దీనిపై నిర్ణయం మాత్రం తీసుకోలేదని అప్పటి కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ డిసెంబర్ 2016 లో లోక్‌సభలో రాతపూర్వకంగా చెప్పారు.
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
This website uses cookies.