Home » Exclusive » Epfo Going To Tell A Good News To Employees Regarding Increase In Minimum Pension
Exclusive

Epfo : ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త.. భారీగా పెరగనున్న మినిమమ్ పెన్షన్…!

Authored By
Inesh A
The Telugu News | Published on: December 26, 2021, 10:40 pm
Advertisement

Epfo : ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ త్వరలోనే ఓ శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. కనీస పెన్షన్ ను రూ. 1000 నుంచి 9 వేల రూపాయలకు పెంచనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా జరుగుతున్న చర్చల ఫలితంగా ఈ అంశంపై త్వరలోనే ఈపీఎఫ్ఓ తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 5 రాష్ట్రాల హైకోర్టులు…

Advertisement

పెన్షన్‌ను ప్రాథమిక హక్కుగా గుర్తించాయని ఈపీఎఫ్ఓ బోర్డు సభ్యుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ విర్జేష్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. అయితే దీని సీలింగ్‌ విషయం మాత్రం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. పదవీ విరమణకు ముందు చివరి నెలలో ఉండే శాలరీని బట్టి పెన్షన్‌ను ఫిక్స్ చేయాలని ఎంతో కాలంగా డిమాండ్లు వస్తున్న విషయం తెలిసిందే. అయితే కార్మిక మంత్రిత్వ శాఖ మాత్రం ఈ విషయంలో అంత సముఖంగా లేనట్లు సమాచారం.

Epfo going to tell a good news to employees regarding increase in minimum pension

Advertisement

ప్రస్తుతం ఈపీఎఫ్ఓ కింద ప్రావిడెంట్ ఫండ్ పొందే సబ్‌స్క్రయిబర్లందరికీ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్-1995 అందుబాటులో ఉంటుంది. ఉద్యోగులకు 58 ఏళ్ల తర్వాత పెన్షన్ లభిస్తుండగా.. వారు కనీసం పదేళ్ల పాటు తప్పనిసరిగా ఆ ఉద్యోగంలో ఉండి తీరాలి. ఈ స్కీమ్ కింద, ఎంప్లాయీ పేరు మీద 12 శాతం మొత్తాన్ని ఎంప్లాయర్ ఈపీఎఫ్‌లో జమ చేయాలి. దీంతో ఉద్యోగులు 58 ఏళ్ల తర్వాత వెయ్యి రూపాయిలు మినిమమ్ పెన్షన్ పొందుతున్నారు.

Inesh A

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి