Junior NTR : టీడీపీ పార్టీ అసలు చంద్రబాబుదే కాదు.. అది సీనియర్ ఎన్టీఆర్ ది. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు కానీ.. నాయకులు కానీ.. ప్రజలు కానీ.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడిగా ఉండాలని.. ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిజంగా టీడీపీ పార్టీపై చంద్రబాబుకు ప్రేముంటే.. జూనియర్ ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ చర్చనీయాంశం అయ్యాయి.
అయితే.. ఎర్రబెల్లి అలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం.. ఖమ్మంలో ఇటీవల చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభ. ఆ సభలో చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిలాగే తెలంగాణను, హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని.. టీడీపీనే దానికి కారణం అని.. అందుకే తెలంగాణలోనూ టీడీపీ బలపడాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొచ్చారు. అంతే కాదు.. టీడీపీని వీడిన నాయకులంతా మళ్లీ తిరిగి టీడీపీలో చేరాలని ఆయన చెప్పుకొచ్చారు. అందరికీ తాను అండగా ఉంటానని వ్యాఖ్యానించడంతో టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు.
అయితే.. చంద్రబాబు ఖమ్మం సభలో ప్రసంగిస్తుండగా.. ఆ సభలోనూ జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా అక్కడికి వచ్చిన కార్యకర్తలు, ప్రజలు నినాదాలు చేశారు. ఎన్టీఆర్ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలు జిల్లాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబు ప్రసంగిస్తున్న చాలా చోట్ల ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తాజాగా మంత్రి ఎర్రబెల్లి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడంతో జూనియర్ త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.