Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ఏపీకి సీఎంగా ఉంటే చూడాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.. మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ఏపీకి సీఎంగా ఉంటే చూడాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.. మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు వైరల్

Junior NTR : టీడీపీ పార్టీ అసలు చంద్రబాబుదే కాదు.. అది సీనియర్ ఎన్టీఆర్ ది. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు కానీ.. నాయకులు కానీ.. ప్రజలు కానీ.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడిగా ఉండాలని.. ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిజంగా టీడీపీ పార్టీపై చంద్రబాబుకు ప్రేముంటే.. జూనియర్ ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :23 December 2022,9:20 pm

Junior NTR : టీడీపీ పార్టీ అసలు చంద్రబాబుదే కాదు.. అది సీనియర్ ఎన్టీఆర్ ది. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు కానీ.. నాయకులు కానీ.. ప్రజలు కానీ.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడిగా ఉండాలని.. ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిజంగా టీడీపీ పార్టీపై చంద్రబాబుకు ప్రేముంటే.. జూనియర్ ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ చర్చనీయాంశం అయ్యాయి.

అయితే.. ఎర్రబెల్లి అలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం.. ఖమ్మంలో ఇటీవల చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభ. ఆ సభలో చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిలాగే తెలంగాణను, హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని.. టీడీపీనే దానికి కారణం అని.. అందుకే తెలంగాణలోనూ టీడీపీ బలపడాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొచ్చారు. అంతే కాదు.. టీడీపీని వీడిన నాయకులంతా మళ్లీ తిరిగి టీడీపీలో చేరాలని ఆయన చెప్పుకొచ్చారు. అందరికీ తాను అండగా ఉంటానని వ్యాఖ్యానించడంతో టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు.

errabelli dayakar rao talks about chandrababu and junior ntr

errabelli dayakar rao talks about chandrababu and junior ntr

Junior NTR : ఖమ్మం సభలోనూ జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా నినాదాలు

అయితే.. చంద్రబాబు ఖమ్మం సభలో ప్రసంగిస్తుండగా.. ఆ సభలోనూ జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా అక్కడికి వచ్చిన కార్యకర్తలు, ప్రజలు నినాదాలు చేశారు. ఎన్టీఆర్ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలు జిల్లాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబు ప్రసంగిస్తున్న చాలా చోట్ల ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తాజాగా మంత్రి ఎర్రబెల్లి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడంతో జూనియర్ త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది