ఈటలతో పాటు మరో ముగ్గురు బీసీ మంత్రులకూ కేసీఆర్ చెక్..?
Etela Rajender : ఈటల రాజేందర్.. ప్రస్తుతం తెలంగాణలో ఈయన గురించే హాట్ టాపిక్. ఈటల రాజేందర్ తెలంగాణ ఆరోగ్య మంత్రి మాత్రమే కాదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిఖార్సయిన నాయకుడు. మొదటి నుంచి సీఎం కేసీఆర్ వెంట ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఈటల రాజేందర్. అందుకే… ఈటల రాజేందర్ కు తెలంగాణలో చాలా పాపులారిటీ ఉంది. అయితే… టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయినా ఇప్పటి వరకు ఎన్నడూ ఈటల రాజేందర్ పై ఎటువంటి ఆరోపణలు రాలేదు. ఏనాడూ ఈటల అవినీతి పరుడు అన్నట్టుగా ఎటువంటి పని జరగలేదు.
కానీ.. అనూహ్యంగా కొన్ని మీడియా చానెళ్లలో ఈటల రాజేందర్ భూకబ్జా చేశారంటూ కథనాలు ప్రసారం అయ్యాయి. 100 ఎకరాలను ఈటల కబ్జా చేశారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే… ఇదంతా ఓవైపు ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి మంత్రి ఈటల టీఆర్ఎస్ హైకమాండ్ తో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఇటీవల కూడా కేసీఆర్ తో ఈటల భేటీ అయినప్పటికీ వీళ్ల మధ్య ఏం జరిగిందనేది తెలియట్లేదు. తాజాగా కొందరు రైతులు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారని తెలిసింది. ఈటల రాజేందర్ భూకబ్జా చేశారని.. తమ భూముల్లో రోడ్లు వేయిస్తున్నారని సీఎంకు రైతులు లేఖ రాయడంతో… వెంటనే విచారణకు కేసీఆర్ ఆదేశించారు. ఆ తర్వాత వెంటనే మీడియాలో ఈటల భూకబ్జా చేశారని కథనాలు ప్రసారం అయ్యాయి.
Etela Rajender : వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన ఈటల రాజేందర్
తనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో వెంటనే మంత్రి ఈటల ప్రెస్ మీట్ పెట్టి… తనపై కావాలని ప్రీ ప్లాన్ చేసి ఇరికించారని తెలిపారు. తనపై ఊరికే ఆరోపణలు చేయడం కాదు… విచారణ చేయించి.. తాను తప్పు చేశానని నిరూపిస్తే.. వెంటనే ముక్కు నేలకు రాస్తా అని సవాల్ విసిరారు. అయితే.. తనపై ఇలాంటి ఆరోపణలు రావడంతో… మంత్రి ఈటల తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఒక్క మంత్రి ఈటలను మాత్రమే టార్గెట్ చేయలేదట. మంత్రి ఈటలతో పాటు మరో ముగ్గురు మంత్రులను కూడా టార్గెట్ చేశారట. వాళ్లకు కూడా త్వరలో ఉద్వాసన పలకనున్నట్టు తెలుస్తోంది.
మరో ముగ్గురు మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ లకు త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఉద్వాసన పలికే అవకాశం ఉందని… తీన్మార్ మల్లన్న తన క్యూన్యూస్ చానెల్ లో వెల్లడించారు. ముందు ఈటలకు పొగబెట్టి ఆ తర్వాత గంగుల కమలాకర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లను మంత్రి పదవి నుంచి తప్పిస్తారని చెబుతున్నారు. ఒక్క మల్లారెడ్డి తప్పితే.. మిగితా ముగ్గురు మంత్రులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులను కావాలనే సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారని మల్లన్న చెప్పుకొచ్చారు. ఎన్నికలు ముగియగానే.. కావాలని ముందస్తు ప్రణాళికతో ఈటలపై బాణం విసిరారని… మరో 2 ఏళ్ల వరకు ఎన్నికలు లేనందున.. సీఎం కేసీఆర్ తన పనిని మొదలు పెట్టారని అంటున్నారు. చూద్దాం మరి.. ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుందో?