Categories: EntertainmentNews

Mega Family : మెగా మనం ఎప్పుడు..ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..

Mega Family : మెగా మనం ఎప్పుడు..ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..అంటూ గత కొన్నేళ్ళుగా మెగా అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అంతక ముందు మల్టీస్టారర్ సినిమాల మాదిరిగా మెగా హీరోలు ఏ ఇద్దరు కలిసి నటించినా చూసేందుకు ఎంతో ఆతృతగా ఉన్న అభిమానులు అక్కినేని ఫ్యామిలీ కలిసి నటించిన మనం సినిమా తర్వాత మాత్రం మెగా హీరోలందరు కలిసి ఆ తరహా సినిమా చేస్తే చూడాలని ఆతృతగా ఉన్నారు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ అక్కినేని నాగేశ్వర రావు, ఆయన తనయుడు నాగార్జున, మనవళ్ళు నాగ చైతన్య, అఖిల్‌లతో మనం సినిమా చేసిపెట్టు జీవితాంతం నిలిచిపోయేలా మంచి బహుమతి ని ఇచ్చాడు.

ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఆయనకు ఎంతో రుణపడి ఉంటామని పలు సందర్భాలలో నాగార్జున స్వయంగా చెప్పుకొచ్చారు. ఇక ఇది ఏఎన్ఆర్ ఆఖరి సినిమా కావడం విశేషం. ఎన్నేళ్ళ తర్వాత చూసుకున్నా అక్కినేని ఫ్యామిలికి ఇది ఒక మరపురాణి తీపి జ్ఞాపకంగా అనిపిస్తుందనడంలో అస్సలు సందేహాలు అవసరం లేదు. అందుకే, అంతకంటే ఎక్కువ మంది హీరోలున్న మెగా ఫ్యామిలీ నుంచి కూడా అభిమానులతో పాటు అందరూ అలాంటి సినిమా కావాలని కోరుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మెగాస్టార్ తలుచుకుంటే ఇదేమీ అంత పెద్ద విషయం కాదు.

fans are waiting for mega multistarer movie

Mega Family: మెగా మనం లో నటించడాని కి స్క్రీన్ స్పేస్ ఉంది.

ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాజమౌళి లాంటి అగ్ర దర్శకులు సినిమా తీయడానికి రెడీ అవుతారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వారు కథ తయారీకి సిద్ధమవుతారు. సాయి మాధవ్ బుర్రా వంటి వారు అద్భుతమైన సంభాషణలు ఇవ్వడానికి ఉత్సాహంగా ఉంటారు. ఇక ఎంత బడ్జెట్ అయినా లెక్క చేయకుండా సినిమా నిర్మించడానికి అల్లు అరవింద్ దగ్గర్నుంచి చరణ్, పవన్ కళ్యాణ్, నాగబాబులకు ఉన్న సొంత నిర్మాణలే సంస్థలే చాలా ఎక్కువ. ఇలా ప్రతీ ఒక్కరు మెగా మనం ప్లాన్ చేస్తే ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తారనడంలో సందేహాలు ఉండవు. మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, నాగబాబు, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్..నిహారిక..ఇలా ఈ మెగా మనం లో నటించడానికి స్క్రీన్ స్పేస్ ఉంది. కానీ, అంత గొప్ప కథ సెట్ అవడమే కావాలి. మరి ఇది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో గానీ.. ప్రతీ ఒక్కరిలోనూ మెగా ఫ్యామిలీ హీరోలందరూ కలిసి నటించే సినిమా కోసం చాలా ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago