PM Kisan : రైతులకు గుడ్ న్యూస్…ఇక పై క్షణాల్లో లోన్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

PM Kisan : రైతులకు గుడ్ న్యూస్…ఇక పై క్షణాల్లో లోన్…!

 Authored By prabhas | The Telugu News | Updated on :8 October 2022,8:00 am

PM Kisan : నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద ఏడాదికి మూడు విడతలుగా 2000 చొప్పున అందిస్తున్నారు. అయితే మోడీ ప్రభుత్వం త్వరలోనే రైతుల బ్యాంకు ఖాతాలో 12వ విడత కింద 2000 జమ చేయనుంది. ఈ డబ్బులను వేయటానికి ముందుగానే రైతులకి మరో గుడ్ న్యూస్ చెప్పింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఖాతాదారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని ప్రకటించింది. ఈ పథకంతో సంబంధం ఉంటే మీరు కూడా కేసీసీ ప్రయోజనాన్ని పొందడానికి అప్లై చేసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యంతో రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు పొందడం సులభం అవుతుంది.

దీంతో ఎక్కువ రేట్లకు రుణాలు తీసుకోకుండా విముక్తి లభిస్తుంది. రైతులు క్రెడిట్ కార్డు సహాయంతో చిన్న వ్యాపారాలని ప్రారంభించుకోవచ్చు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీని నెరవేర్చుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాల ద్వారా రైతులకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు చాలా తక్కువ ధరలకు రుణాలను అందిస్తుంది. అర్హులైన రైతులు మాత్రమే దాని నుంచి ప్రయోజనం పొందుతారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీ పంటకు సంబంధించిన ఖర్చులకు ఆ ఋణాన్ని ఉపయోగించుకోవచ్చు.

Farmers for PM Kisan Samman Nidhi Yojana 12th tranche

Farmers for PM Kisan Samman Nidhi Yojana 12th tranche

పంటకు విత్తనాలు, ఎరువులు పురుగుల మందులు, మిషన్లు మొదలైన వాటి కోసం డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఈ లోన్ కింద 1.60 లక్షల వరకు ఎలాంటి ష్యురిటీ లేకుండా లోన్ పొందవచ్చు. రైతులు మూడు సంవత్సరాలలో ఈ పథకం నుంచి ఐదు లక్షల వరకు రుణం పొందవచ్చు. ప్రభుత్వం నుండి వడ్డీ రేటు పై రెండు శాతం తగ్గింపు కూడా ఉంది. దీంతో 9 శాతానికి బదులుగా 7 శాతం మాత్రమే వడ్డీ చెల్లించవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం బ్యాంకులో ఫారమ్ నింపాలి. దీంతోపాటు పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ర డ్రైవింగ్ లైసెన్స్, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు పెట్టి ఫామ్ ను పూరించాలి. బ్యాంకు అన్ని చెక్ చేసాక రుణాన్ని అందజేస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది