Viral News : కొడుకు పెళ్ళానికి తాళి కట్టిన మావ .. ప్రపంచంలో ఎక్కడా జరగని వింత ఇది !

 Authored By prabhas | The Telugu News | Updated on :2 February 2023,2:00 pm

Viral News : ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. మామ, కోడలు చేసిన పనికి అందరూ షాక్ అయిపోయారు. ఉత్తరప్రదేశ్ లోని ఛపియా ఉమ్రావ్‌ గ్రామానికి చెందిన 70సంవత్సరాల కైలాష్ యాదవ్ తన కోడలు పూజ అనే 28సంవత్సరాల మహిళను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి జరిగిన పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరి పెళ్లి ఫోటోలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. 70సంవత్సరాల వయసుగల కైలాష్ యాదవ్ బదల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు.

father married son wife viral news

father married son wife viral news

అతనికి నలుగురు పిల్లలు.12ఏళ్ల క్రితం తన భార్య చనిపోయింది. తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు కానీ ఆమెకు విడాకులు ఇచ్చాడు. అయితే తన మూడో కుమారుడు చనిపోయాడు. అతని భార్య పూజ భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉంటుంది. దీంతో మామ కోడలు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తమ బంధం గురించి ఎవరు తప్పుగా అనుకున్న అవేవి పట్టించుకోకుండా ఇద్దరు గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య 42 ఏళ్ల గ్యాప్ ఉంది అయినా ఇద్దరి అంగీకారంతోనే పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది.

father married son wife viral news

father married son wife viral news

ఇక వీరి పెళ్లి బంధువులు, గ్రామస్తుల సమక్షంలో జరిగింది. సమాజంతో సంబంధం లేకుండా వీరి పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక పూజ కూడా ఈ కొత్త సంబంధంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పెళ్లి గురించి వైరల్ కావడం వల్లే తమకు తెలిసిందని స్టేషన్ ఇన్‌ఛార్జ్ బర్హల్‌గంజ్ చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదు అని ఆయన తెలిపారు. ఏంటో జనాలు రోజురోజుకీ ఇలా తయారవుతున్నారు అని కొందరు మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా మామ కోడలి పెళ్లి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి