Home » News » Film Fans And Director Krish Fans Trolls On Pawan Kalyan
News

Pawan Kalyan : ప్రముఖ దర్శకుడు పవన్ కళ్యాణ్ వల్ల చాలా నష్టపోతున్నాడు పాపం..!

Authored By
aruna
The Telugu News | Published on: August 1, 2022, 7:40 pm
Advertisement

Pawan Kalyan : టాలీవుడ్ లో ఎంతో మంది ప్రముఖ దర్శకులు ఉన్నారు. వారిలో అద్భుత ప్రతిభ ఉన్న దర్శకులు కొద్ది మంది అనడంలో సందేహం లేదు. మల్టీ టాలెంటెడ్ దర్శకులుగా పేరు దక్కించుకున్న కొద్ది మందిలో క్రిష్ ఒకరు. ఆయన తన ప్రతి సినిమా ను చాలా విభిన్నంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కమర్షియల్ సినిమాల కంటే విభిన్న సినిమాలను తీయడం ద్వారా ఆయనకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. జాతీయ స్థాయి అవార్డులను దక్కించుకున్న దర్శకుడు క్రిష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వద్ద ఆగిపోయాడు.

Advertisement

భారీ చిత్రాలను కూడా చాలా తక్కువ సమయంలో తెరకెక్కించి రాజమౌళి వంటి పెద్ద దర్శకుల ఆశ్చర్య పరిచిన దర్శకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మొదలు పెట్టిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ని పూర్తి చేయడానికి నానా కష్టాలు పడుతున్నాడు. ఆ సినిమా ప్రారంభించి దాదాపు రెండు సంవత్సరాలు కాబోతుంది. కరోనా వల్ల అదిగో ఇదిగో అంటూ వాయిదా పడుతూ వచ్చిన ఆ సినిమా ఇంకా కూడా షూటింగ్ పూర్తి కాలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు.

film fans and director krish fans trolls on Pawan kalyan

Advertisement

కనుక ఈ సినిమా ఎప్పటికీ పూర్తి అవుతుంది అనే విషయం పై క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా కమిట్ అవ్వకపోతే ఈపాటికి దర్శకుడు క్రిష్ కనీసం మూడు నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేవాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ముందు కొండపొలం అనే సినిమాను కేవలం రెండు నెలల గ్యాప్ లోనే తెరకెక్కించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అలా మూడు నాలుగు సినిమాలు దర్శకుడు క్రిష్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేవాడు. పవన్ కళ్యాణ్ వల్ల ఒక ప్రతిభావంతుడైన దర్శకుడు సినిమాలు చేయకుండా ఉండి పోయాడు అంటూ సినీ ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇలా చేయడం సరికాదని ఇప్పటికే హరీష్ శంకర్ కూడా రెండు సంవత్సరాల పాటు వెయిట్ చేయించాడు అని విమర్శలు వస్తున్నాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి