Women : మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి 24 వేలు..!
ప్రధానాంశాలు:
Women : మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కోక్కరికి 24 వేలు..!
Women : బీసీలకు స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే పలు పథకాల అమలుకు ప్రణాళికలు రూపొందించి అనుమతి కోసం సీఎంకు పంపించిన బీసీ సంక్షేమ శాఖ మొదటగా రెండు స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. సుమారు 80 వేల మంది బీసీ, ఈబీసీ మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే అన్ని మండల కేంద్రాల్లోను, నగరాల్లోను, పట్టణాల్లోను డిమాండ్ ఉన్న చోట జనరిక్ షాపులను నడిపేందుకు యువతకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.
స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేసేందుకు ఓబీఎంఎస్ వెబ్‌సైట్‌నూ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు శిక్షణ ఇచ్చేందుకు సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచారు. ఒక్కో బీసీ, ఈబీసీ మహిళకు రోజుకు 4 గంటల చొప్పున 90 రోజుల పాటు టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం మండల కేంద్రాల్లో శిక్షణ ఏర్పాట్లు చేయనున్నారు. శిక్షణ అనంతరం వారికి రూ.24,000 విలువ చేసే కుట్టు మిషన్లు అందించనున్నారు.
Women జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటు..
ప్రస్తుతం జనరిక్ మందులు కొరత కొనసాగుతోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా జనరిక్ మందుల షాపులు అందుబాటులో తేవాలని ప్రభుత్వం చూస్తోంది. ప్రతి మండల కేంద్రంలో ఒక జనరిక్ షాపును ఏర్పాటు చేయడం ద్వారా స్వయం ఉపాధి కల్పించవచ్చని భావిస్తున్నారు. డీ ఫార్మా, బీ ఫార్మసీ కోర్సు సర్టిఫికెట్ కలిగిన బీసీ, ఈబీసీ యువతను ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక్కో షాపు అభివృద్ధి కోసం బీసీ సంక్షేమ ఆర్థిక సంస్థ రూ.8 లక్షలు అందించనుంది. అందులో రూ.4 లక్షలు సబ్సిడీగా ఇచ్చి, మిగిలిన రూ.4 లక్షలు రుణంగా ఇప్పించాలని నిర్ణయించారు.